ధనుష్ 'రాయన్' రివ్యూ : మూవీ హిట్టా ఫట్టా..?
హీరో ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో ధనుష్ సినిమాలకు ఫుల్ డిమాండం ఉంది. తెలుగులో కూడా ధనుష్‌కు ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ధనుష్ ఏ సినిమా చేసిన , అది తెలుగులో విడుదల కావాల్సిందే. ధనుష్ తాజాగా నటించిన 'రాయన్' సినిమా ఈ రోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'రాయన్' ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా తెరకెక్కడం విశేషం.
ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి, దసరా విజయ్ వంటి నటులు ఈ సినిమాలో నటించారు.ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాను చూసిన కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఓ ప్రాంతంలో కొందరి మధ్య జరిగే అధిపత్య పోరునే రాయన్ 'అసలు' కథ. నాయకుడుగా ఎదిగిన హీరోకు చెక్ పెట్టాడానికి శత్రువులందరు ఒకటవుతారు. వీరందర్ని హీరో ఎలా ఎదరించాడు. తనని నమ్ముకున్న వారికి హీరో ఎలా న్యాయం చేశాడనేది మిగిలిన స్టోరీ. ఫస్ట్ హాఫ్ బాగుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ అదరగొట్టాడని. సెకండ్ హాఫ్‌కి మంచి స్టఫ్ దొరికిందని సినిమా చూసిన ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
కథ పాతదే అయినప్పటికి తెర మీద అద్భుతంగా చూపించడంలో ధనుష్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ధనుష్ సక్సెస్ అయ్యాడన్న మాట వినిపిస్తోంది. రా అండ్ రస్టిక్ రోల్‌లో ధనుష్ మరోసారి అద్భుతం చేశాడని.. గుండు చేయించుకుని ధనుష్ డీ గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా ఎస్ జె సూర్య నటించారు. ఎప్పటిలాగే ఎస్ జె సూర్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని..ఆయన పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుందని అంటున్నారు.
సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. ధనుష్, సందీప్ కిషన్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ మెప్పిస్తాయని చెబుతున్నారు. కీలక పాత్రల్లో కనిపించిన నటులు, వారి పాత్రలకు న్యాయం చేశారని చెబుతున్నారు. ఇక సినిమాకు ఏఆర్ రెహమాన్ ప్లస్ పాయింట్ అని, 'రాయన్' కు సెకండ్ హీరో మ్యూజిక్ అని ఆడియన్స్ చెబుతున్నారు. చాలాకాలం తర్వాత ఏఆర్ రెహమాన్ తన మార్క్ చూపించారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో ఏఆర్ రెహమాన్ కమ్ బ్యాక్ అయ్యారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ధనుష్ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications