రాయన్ సినిమా చూశాక థియేటర్ నుండి పరుగులు తీసిన ధనుష్.. వీడియో వైరల్!!

చాలా న్యాచురల్ గా నటించే నటుడు ధనుష్ సినిమాలంటే తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి క్రేజ్ ఉంటుంది. హీరో ధనుష్ ఏ పాత్రలో నటించిన ఇట్టే ఆ పాత్రలో ఇమిడిపోయి ప్రతి ఒక్కరికి మనసుకు దగ్గరగా అనిపిస్తాడు. ధనుష్ చేసిన సినిమాలు, అతను సెలెక్ట్ చేసుకునే కథలు కూడా అంతే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి.

ధనుష్ సినిమా రాయన్ ధియేటర్ లలో సందడి
తాజాగా ధనుష్ నటించిన 'రాయల్ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో ప్రదర్శితం అవుతుంది. ధనుష్ నటించిన 50వ సినిమాగా ఈ సినిమా పైన ధనుష్ అభిమానులలో బోలెడు అంచనాలు ఉన్నాయి. ధనుష్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, సెల్వ రాఘవన్ వంటి దిగ్గజనటులు నటించారు.

Dhanush ran out of the theater after watching Raayan movie Video viral

ధనుష్ కు సంతృప్తిని ఇచ్చిన రాయన్
ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పైన ఇప్పటికే మంచి టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం తీసుకున్న కథ పాతది అయినప్పటికీ ధనుష్ తన నటనతో అందరిని మెప్పించాడని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే హీరో ధనుష్ స్వీయ దర్శకత్వం వహించిన రాయన్ సినిమా ధనుష్ కు మంచి సంతృప్తిని ఇచ్చిందని అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినిమా చూసి ధియేటర్ నుండి పరుగులు పెట్టిన ధనుష్
ఈరోజు సినిమా విడుదలైన సందర్భంగా ఫ్యాన్స్ మరియు చిత్ర యూనిట్ తో కలిసి ధనుష్ చెన్నైలోని రోహిణి థియేటర్లో సినిమా చూశారు. ఇక తమ అభిమాన హీరో ధనుష్ థియేటర్ కు వస్తున్నాడు అని తెలిసిన ఫ్యాన్స్ అతని కోసం భారీగా థియేటర్ వద్దకు చేరుకున్నారు. సినిమా చూసిన అనంతరం ధనుష్ చాలా సంతోషంగా వేగంగా మెట్లు దిగుతూ కార్ వద్దకు పరుగులు తీశారు.

ధనుష్ లో జోష్ .. సినిమా సక్సెస్ కు సంకేతం
ఆ తర్వాత కార్ ఎక్కి ఫ్యాన్స్ అందరికీ అభివాదం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ధనుష్ ముఖంలో కనిపించిన సంతోషం సినిమా బాగుందని, సక్సెస్ అవుతుందని చెప్పకనే చెప్తుంది. ధనుష్ లో కనిపించిన కాన్ఫిడెన్స్ కు ఆయన ఉత్సాహం అద్దం పడుతుంది.

బ్లాక్ బస్టర్ హిట్ గా రాయన్
ఈ సినిమాలో సందీప్ కిషన్ కూడా కీలక పాత్రలో కనిపించడం, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్లు సినిమాలో ప్రత్యేకంగా నిలిచాయని చెబుతున్నారు, ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా ఒక అసెట్ లాగా నిలిచిందని, ఈ సినిమా ధనుష్ సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ధనుష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+