సైలెంట్ గా వచ్చి కొట్టేశాడు బాబోయ్.. 'ఓజీ', 'కాంతార' అవుటేనా..!

భారీ బడ్జెట్, భారీ యాక్షన్, స్టార్ హీరోలు ఉన్న సినిమాలకు బజ్ ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమాలకు ఆడియన్స్ ఆకాశమంత అంచనాలు పెట్టుకుంటారు. కొంచెం తగ్గినా సీను మారిపోతుంది. అందుకే బిగ్ బడ్జెట్ మూవీస్ హిట్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. లేకపోతే డిజాస్టర్ గా మిగిలిపోతుంటాయి. ఇక ఈ సారి దసరా పండగ కానుకగా మూడు సినిమాలు రానున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజిత్ కాంబోలో వచ్చిన ఓజీ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రచ్చరంబోలా చేస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అయితే ఈ మూవీ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఒక్కో సీన్ ఒక్కో డైమండ్ లా సుజిత్ తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ మూవీ రూ. 250 కోట్లు దాటి రూ. 300 కోట్లు దిశగా దూసుకెళ్తోంది.

అయితే ఓజీ సినిమాకు సెన్సార్ దెబ్బేసింది. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ రావడంతో చిన్న పిల్లలు, మహిళలు సినిమా చూసేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నారు. లేదంటే ఈపాటికే మరిన్ని కలెక్షన్లు రాబట్టేది ఓజీ మూవీ. దాంతోపాటు ఈ మూవీ కేవలం ఫ్యాన్స్ కోసమే తీసినట్లుగా ఉందని సినీవర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

ఇక దసరా కానుకగా కాంతార ఛాప్టర్ 1 సినిమా కూడా రానుంది. అక్టోబర్ 2 న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆసక్తిని రేపుతోంది. ఈ మూవీ విజువల్ స్పెక్టాకిల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. హైప్ అయితే భారీగానే ఉంది. కానీ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Dhanush s Idli Kadai Scores Clean U Certificate Poised for Dussehra Box-Office Glory

ఇక పండక్కు మరో సినిమా కూడా సిద్ధమైంది. అదే ధనుష్ నటించిన ఇడ్లీ కొట్టు. ధనుష్ మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పెద్ద సినిమాలు ఉన్నా సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టడం ఆయన స్పెషాలిటీ. ఇటీవల కుబేర చిత్రంతో మెప్పించిన ధనుష్ తాజాగా ఇడ్లీ కొట్టు మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీ అక్టోబర్ 1 న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉంది. మూవీ సూపర్ హిట్ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.

గ్రామీణ వాతావరణంలో సాగే ఈ కథకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. దీంతో చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని అధికంగా చూసే అవకాశం ఉంది. గతంలోనూ పండక్కి వచ్చిన పెద్ద సినిమాలను దాటి చిన్న సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. దీంతో ఈ సారి దసరా విన్నర్ ఇడ్లీ కొట్టు అని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+