రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు?
Dhurandhar 2: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సంచలనాన్ని సృష్టిస్తోంది. అయితే ఈ భారీ సక్సెస్ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అదే ఈ సూపర్ హిట్ చిత్రంలోని విలన్ పాత్ర. ఓ పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రంలో హీరో క్యారెక్టర్ ఎదగాలంటే నెగిటివ్ రోల్ అంతకంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ సినిమా మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా పోషించిన 'రెహ్మాన్ డకైత్' పాత్రతో పోలిస్తే.. రెండో భాగంలో అర్జున్ రాంపాల్ పోషించిన మేజర్ ఇక్బాల్ పాత్ర కొంచెం వెలవెలబోయిందని అభిమానులు భావిస్తున్నారు. ఈ రెండు పాత్రలను పోల్చి చూస్తే రెహ్మాన్ డకైత్ పాత్ర అద్భుతంగా పేలిందని.. మేజర్ ఇక్బాల్ పాత్ర కాస్త డల్ అయిందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
రెహ్మాన్ డకైత్.. భయాన్ని బ్రాండ్‌గా మార్చిన విలన్
మొదటి పార్ట్‌లో 'రెహ్మాన్ డకైత్' పాత్రకు రైటర్స్ ఇచ్చిన ఎలివేషన్ అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్ర స్క్రీన్ మీద కనిపించకముందే అతని క్రూరత్వం గురించి ఇతర పాత్రలు చెప్పే మాటలు ప్రేక్షకుల్లో ఓ రకమైన వణుకు పుట్టిస్తాయి. సొంత తల్లిని చంపేంత కసాయి అని.. తన కొడుకు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడని చెప్పడం ద్వారా ఆ పాత్రకు ఓ బలమైన పునాది వేశారు. అక్షయ్ ఖన్నా తన విలక్షణమైన నటనతో ఆ పాత్రకు అద్భుతంగా న్యాయం చేశాడు. మరోవైపు రెహ్మాన్ డకైత్ పాత్రలో ఓ స్పష్టమైన ఎమోషన్(కొడుకు మీద ప్రే) ఉండటం వల్ల.. అతను చేసే విధ్వంసానికి ఓ అర్థం ఉన్నట్లు ప్రేక్షకులకు అనిపిస్తుంది. మరోవైపు తనను నమ్ముకున్న వారికోసం ఎంతటికైనా తెగించడానికి సిద్ధపడే క్యారెక్టర్.. తన కుటుంబం పట్ల, తన అనుచరుల పట్ల రెహ్మాన్ డకైత్ చూపించే ప్రేమ ప్రేక్షకులకు ఓ స్పష్టమైన క్యారెక్టరైజేషన్ ఇచ్చింది. అతను ఏదైనా సాధించాలనుకుంటే ప్రాణాలైనా ఇస్తాడనే నమ్మకం కలిగింది.మొదటి భాగం క్లైమాక్స్‌లో రెహ్మాన్ డకైత్ దాదాపు తప్పించుకున్నంత పని చేశాడు. అతని ప్లానింగ్, మొండితనం అతన్ని ఓ గొప్ప విలన్‌గా నిలబెట్టాయి.

మేజర్ ఇక్బాల్ ఎందుకు వీక్ అయ్యాడు?
'ధురంధర్2'లో మేజర్ ఇక్బాల్ పాత్రపై భారీ అంచనాలు నెలకొనడంతో పాటు అర్జున్ రాంపాల్ వంటి నటుడు తోడవ్వడంతో ఇది మొదటి భాగం కంటే భయంకరంగా ఉంటుందని అభిమానులు భావించారు. కానీ ఇక్కడే రైటర్స్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మేజర్ ఇక్బాల్‌ను ఓ సాధారణ దేశద్రోహిగా, ఉగ్రవాదిగా మాత్రమే చూపించారు కప్పి.. అతనికంటూ ఓ ప్రత్యేకమైన సిద్ధాంతం లేదా వ్యక్తిత్వాన్ని సృష్టించలేకపోయారు. 'షోలే'లో గబ్బర్ సింగ్ కు ఓ ఈగో ఉంటుందని.. 'అగ్నిపథ్'లో కాంచా చీనాకు ఓ రకమైన పిచ్చి ఉంటుంది. కానీ మేజర్ ఇక్బాల్ పాత్రలో అటువంటి వైవిధ్యం ఏమీ కనిపించదు.
తండ్రి పాత్రతో దెబ్బతిన్న విలన్ ఇమేజ్
'ధురంధర్2' సినిమాలో మేజర్ ఇక్బాల్ పాత్రను మరింత బలహీనపరిచింది అతడి తండ్రి పాత్రేనని అభిమానులు భావిస్తున్నారు. పాక్ ఆర్మీలోని పాతతరం ఆలోచనలను ఎండగట్టడానికి రాసిన ఈ తండ్రి పాత్ర.. మేజర్ ఇక్బాల్‌ను నిరంతరం బూతులు తిడుతూ ఉంటుంది. విలన్ అంటే సొసైటీ భయపడాలి.. కానీ తన తండ్రి చేతిలోనే రోజూ తిట్లు తినే విలన్‌ను చూసి ప్రేక్షకులు భయపడటం మానేసి నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఓ విలన్ పాత్రలో ఉండాల్సిన భయం ఈ సన్నివేశాల వల్ల పూర్తిగా దెబ్బతింది. పైగా మేజర్ ఇక్బాల్ తన నోటితో తనే తన క్రూరత్వాన్ని చెప్పుకోవడం కూడా అభిమానులకు అంతగా నచ్చలేదు.
అర్జున్ రాంపాల్ కష్టం వృథా?
కేవలం నటన పరంగా చూస్తే అర్జున్ రాంపాల్ తన వంతుగా గొప్ప ప్రయత్నమే చేశాడు. తన బాడీ లాంగ్వేజ్, కళ్లలో కసి, గంభీరమైన కంఠస్వరంతో మేజర్ ఇక్బాల్ పాత్రకు ప్రాణం పోశాడు. కానీ బలహీనమైన స్క్రిప్ట్ వల్ల అతని కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఓ విలన్ చేసే పనులు పవర్‌ఫుల్‌గా ఉండాలి తప్ప, మాటలు కాదు. దురదృష్టవశాత్తు మేజర్ ఇక్బాల్ పాత్ర మాటలకే పరిమితమైంది. అందుకే ప్రేక్షకులు ఇప్పటికీ రెహ్మాన్ డకైత్ చేసిన విధ్వంసాన్ని గుర్తుచేసుకుంటున్నారు తప్ప.. మేజర్ ఇక్బాల్ చేసిన పనులను కాదు. మొత్తానికి 'ధురంధర్ 2' ఒక అద్భుతమైన సీక్వెల్ అయినప్పటికీ, విలన్ విషయంలో మాత్రం మొదటి భాగం సృష్టించిన మ్యాజిక్‌ను అందుకోలేకపోయింది.
-
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications