'ధురంధర్ 2' స్క్రిప్ట్ నాది కాదు.. ఆదిత్య ధర్‌కు బిగ్ రిలీఫ్!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా చుట్టూ ముసురుకున్న స్క్రిప్ట్ వివాదానికి బాంబే హైకోర్టు తాజాగా బ్రేక్ వేసింది. ఈ సినిమా కథ తనదేనంటూ సోషల్ మీడియాలో, ఇతర వేదికలపై ఆరోపణలు చేసిన ఫిల్మ్ మేకర్ సంతోష్ కుమార్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని హెచ్చరించింది. ఈ పరిణామంతో ఆదిత్య ధర్‌కు వ్యతిరేకంగా ఇకపై ఎలాంటి పరువు నష్టం కలిగించే కామెంట్స్ చేయబోనని సంతోష్ కుమార్ న్యాయస్థానానికి లిఖితపూర్వక హామీ ఇచ్చారు.

అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది?
'ధురంధర్' సినిమా కథ తాను గతంలో రిజిస్టర్ చేసుకున్న 'డి సాహెబ్' అనే కథకు నకలు అని సంతోష్ కుమార్ ఆరోపించారు. అయితే ఆదిత్య ధర్ ఈ వాదనలను తీవ్రంగా ఖండించారు. ఈ నిరాధారమైన ఆరోపణలు తన వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని.. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆరిఫ్ డాక్టర్ సంతోష్ కుమార్ నుంచి 'అండర్‌టేకింగ్' తీసుకున్నారు. భవిష్యత్తులో ఈ అంశంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే కేవలం చట్టపరమైన మార్గాల్లోనే పోరాడాలని.. బహిరంగంగా దర్శకుడి వ్యక్తిత్వాన్ని కించపరచకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Dhurandhar 2 Script Dispute Big Relief for Aditya Dhar as Bombay High Court Warns Opponent

మరోవైపు 2025లో విడుదలైన ఈ సిరీస్ మొదటి భాగం 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని సంచలనం సృష్టించింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్ల రూపాయల భారీ వసూళ్లను రాబట్టింది. విడుదలైన మూడు నెలల తర్వాత కూడా థియేటర్లలో ఈ సినిమా ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతుండటం విశేషం. రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా సీక్వెల్ (పార్ట్ 2) పై కూడా బాక్సాఫీస్ ను బద్ధలు కొట్టింది. చట్టపరమైన చిక్కులు, స్క్రిప్ట్ వివాదాలు తలెత్తినప్పటికీ.. 'ధురంధర్ 2' పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తాజా ఆదేశాలు దర్శకుడు ఆదిత్య ధర్‌కు పెద్ద ఊరటనిచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+