రణవీర్ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ నటి! (వీడియో)

రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'దురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 'భాభీజీ ఘర్ పర్ హై' ఫేమ్ సౌమ్య టాండన్, రణవీర్ సింగ్‌ను అందరి ముందూ చెంపదెబ్బ కొట్టి వార్తల్లో నిలిచారు. దురంధర్ 2 విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 236.63 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ పార్టీలో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సీన్ రీ-క్రియేట్ చేసిన 'ఉల్ఫత్'
'దురంధర్ 2' సినిమాలో రెహమాన్ డకైత్(అక్షయ్ ఖన్నా) భార్య ఉల్ఫత్ పాత్రలో సౌమ్య టాండన్ నటించారు. సినిమాలో ఓ కీలక సన్నివేశంలో తన భర్త మరణానికి కారణమైన హంజా అలీ మజారీ(రణవీర్ సింగ్)ని ఆమె అందరి ముందూ చెంపదెబ్బ కొడుతుంది. ఈ సినిమా సక్సెస్ పార్టీలో సరదాగా అదే సీన్‌ను సౌమ్య టాండన్ రీ-క్రియేట్ చేశారు. రణవీర్ సింగ్ కూడా ఆమెకు సహకరిస్తూ ఆ చెంపదెబ్బను స్వీకరించడం విశేషం.

Dhurandhar 2 Success Soumya Tandon Slaps Ranveer Singh in Viral Video Day 1 Box Office 236 Cr

'థప్పడ్ క్వీన్' ట్యాగ్ ఇచ్చి రణవీర్ సింగ్
ఈ సరదా సన్నివేశం తర్వాత రణవీర్ సింగ్ స్వయంగా సౌమ్యకు 'థప్పడ్ క్వీన్' అనే ట్యాగ్ ఇచ్చారు. "పార్టీలో ఉన్న వారందరూ ఆమెతో చెంపదెబ్బ తినాలని కోరుకుంటున్నారు" అంటూ రణవీర్ సింగ్ చమత్కరించడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సౌమ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. చిత్ర యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు."ధురంధర్ టీంతో కలిసి చరిత్ర సృష్టించినందుకు గర్వంగా ఉంది. నన్ను ఈ సినిమాలో భాగం చేసినందుకు దర్శకుడు ఆదిత్య ధర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు." అని సౌమ్య టాండన్ పేర్కొన్నారు.

బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' ప్రభంజనం
విడుదలైన మొదటి రోజే 'దురంధర్ 2' సినిమా దూకుడు కలెక్షన్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.236.63 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఇండియా నెట్ కలెక్షన్ రూ.139.78 కోట్లు వచ్చాయి. యాక్షన్ సీక్వెన్సులు, దేశభక్తి కలగలిసిన ఈ చిత్రం రెండో రోజు కూడా హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకుపోతోంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+