"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన మూవీ "ధురంధర్ - ది రివెంజ్". ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే మరింత భారీ హిట్ కొట్టింది. నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా చేయగా.. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. 'ధురంధర్ ' మొదటి పార్టుని కేవలం హిందీలో మాత్రమే ముందు రిలీజ్ చేయగా.. ఈ సెకండ్ పార్టుని హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో దక్షిణాది భాషలన్నింటిలోనూ చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేశారు. ధురంధర్ 2 దాదాపు 4 గంటలు ఉండగా అంత సేపు ఆడియన్స్‌ని సీట్లలో కూర్చోబెట్టడంలో డైరెక్టర్ ఆదిత్య ధార్ చాలా వరకూ సక్సెస్ అయ్యారు.

కాగా ధురంధర్‌ ఫస్ట్ పార్టుకి మంచి టాక్‌ రావడం.. టీజర్‌తోనే ధురంధర్‌ సెకండ్ పార్ట్ మీద భీభత్సమైన హైప్‌ క్రియేట్‌ కావడంతో మార్చి 19 ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్ కొట్టడం పక్కా అనుకున్నారు. అనుదకు తగ్గట్టు గానే మార్చి 19కన్నా ఒక రోజు ముందే ప్రీమియర్స్ తో పాజిటివ్ టాక్ అందుకుంది ధురంధర్‌ సీక్వెల్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గరే కాకుండా సోషల్ మీడియాలో కూడా జోరుగా చర్చ నడుస్తోంది. పలు భాషల స్టార్ హీరోలు సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ అయితే ఇప్పుడు ఈ మూవీ కారణంగా పాకిస్థాన్ లో కలకలం రేగుతోంది.

dhurandhar-the-revenge-movie-creates-huge-panic-at-pakistan-and-started-searching-for-indian-agents

ఈ సినిమా విడుదల తర్వాత పాకిస్థాన్‌ లోని కరాచీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అత్యంత రద్దీగా ఉండే లియారి ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితి యుద్ధ వాతావరణం తలపిస్తోంది. భారతీయ గూఢచారులు తమ మధ్యే ఉన్నారనే అనుమానంతో పోలీసులు వెతుకులాట జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రతి వీధిలోనూ, ప్రతి సందులోనూ అనుమానితుల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక ప్రజలు కూడా పోలీసులతో చేతులు కలిపి, కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే వారిని విచారిస్తున్నారు. దాంతో ఇన్నాళ్లు గ్యాంగ్ వార్లకు, ఫుట్‌బాల్ ‌కు పేరుగాంచిన ఈ ప్రాంతం ఇప్పుడు 'స్పై హంట్' గా మారిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు ఇప్పటివా? గతంలోనివా? అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది.

మూవీ ఎలా ఉందంటే..?

ధురంధర్ 2 లో పంజాబ్‌లోని ఓ సాధారణ ఆర్మీ జవాన్ కొడుకైన జస్కిరాత్.. హమ్జాగా మారాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? అనే విషయాన్ని చాలా బలంగా చూపించాడు. ఇక దేశభక్తితో జవాన్ అవుదామనుకున్న కుర్రాడ్ని అదే దేశంలోని రాజకీయం ఒక హంతకుడ్ని చేసిన తీరు ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఇక రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) మరణం తర్వాత ల్యారీలో చెలరేగిన అల్లర్లు.. పాకిస్థాన్ రాజకీయాల్లో హమ్జా ఎదిగిగిన తీరును చూపించారు. ముఖ్యంగా భారత్ లో జరిగిన ముఖ్యమైన ఘటనలను కూడా ప్రస్తావించారు. మరి ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి.. పంజాబ్, యూపీ రాష్ట్రాల్లోకి డ్రగ్స్, టెర్రరిజం సప్లై చైన్ ఎలా నడుస్తుందనే వాస్తవాలను కూడా ఈ సినిమాలో ఎక్స్‌పోజ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+