ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన 'ధురంధర్' మూవీ భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ మూవీకి కొనసాగింపుగా 'ధురంధర్-2 ది రివెంజ్' మూవీ రిలీజ్ కానుంది. మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈమేరకు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ధురంధర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో ధురంధర్ పార్ట్-2 ను అన్ని ప్రాంతీయ భాషల్లో తెరకెక్కించాలని నిర్ణయించింది చిత్ర నిర్మాణ సంస్థ. అందులో భాగంగానే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది.

'ధురంధర్-2 ది రివెంజ్' మూవీ తెలుగు ట్రైలర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కష్టం. అంత అద్భుతంగా ఈ ట్రైలర్ ఉంది. ధురంధర్ సినిమాను మించిన స్థాయిలో ఈ ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్ దాదాపు 3 నిమిషాల 25 సెకన్ల పాటు ఉంది. ట్రైలర్ చూస్తుంటే రణ్ వీర్ సింగ్ బ్లడ్ బాత్ లుక్ లో కనిపిస్తున్నాడు. బీస్ట్ మోడ్ ఆన్ అని ట్రైలర్ లోనే చెప్పేశారు. ఇక థియేటర్లు తగలబడటం ఖాయమని తెలుస్తోంది. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. తొలి భాగంలో హమ్జా పాత్రలో మెప్పించాడు. ఈ రివెంజ్ పార్ట్ లో జస్కిరత్ సింగ్, హమ్జా పాత్రలతో కనిపించనున్నాడు.

ఈ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తొలి భాగం ధియేటర్లలో దాదాపు నెల రోజులకుపైగానే ఆడింది. రూ. 1400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. దాంతో రెండో పార్టుపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే అంచనాలను సులభంగా అందుకునేట్టుగా సినిమా ఉండబోతుందని స్పష్టం అవుతోంది. ఇక రణ్ వీర్ సింగ్ విధ్వంసం చూడాలంటే మార్చి 19 వరకు ఆగాల్సిందే.

dhurandhar2 movie Trailer Out now Ranveer Singh Unleashes Revenge Fury in Explosive Action Sequel

ఈ మూవీని 'యూరి' ఫేమ్ ఆదిత్య ధర్ తెరకెక్కించాడు. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ తో పాటు సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జియో స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+