నయనతార ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకుందా...? బయటపడ్డ అసలు నిజం
సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నుంచి కూడా నయనతారకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల కాలంలో నయనతార సోషల్ మీడియాలో ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో పడేందుకు వరుస బాలీవుడ్ ఈవెంట్స్‌లో హాజరు అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నయనతార లేటెస్ట్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల జీక్యూ నిర్వహించిన మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ యంగ్ ఇండియన్స్ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నయనతార ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా నయనతారకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నయనతార తన కనుబొమ్మలకు సర్జరీ చేయించికుందంటూ గత కొంతకాలంగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై నయనతార క్లారిటీ ఇచ్చారు.
అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆమె తెలిపారు. నా కనుబొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్లకు ముందు వాటిని మార్చుతుంటాను. వాటి కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి అందంగా ఉండేలా సెట్ చేసుకుంటాను. కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపిస్తుంది.అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని ప్రజలు భావించి నేను సర్జరీ చేయించుకున్ననని భావిస్తున్నారని, కానీ అలాంటి ఏమీ లేదని ఈ బ్యూటీ వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications