'గేమ్ ఛేంజర్' కలెక్షన్లు అంతా ఫేక్..చెప్పేసిన దిల్ రాజు
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమాల కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా కలెక్షన్ల విషయంలో చాలా తేడా కనిపించింది. వచ్చిన కలెక్షన్లకు, ప్రకటించిన కలెక్షన్లకు రూ.100 కోట్లకుపైగానే తేడా కనిపించింది. దీంతో 'గేమ్ ఛేంజర్' కలెక్షన్లు ఫేక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.186 కోట్లు వసుళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది. అయితే ట్రేడ్ వర్గాల లెక్కలకు, నిర్మాతలు ప్రకటించిన వసూళ్లకు చాలా వ్యాత్యాసం కనిపించింది.బాక్సాఫీస్ ట్రాకర్స్ ప్రకారం, 'గేమ్ ఛేంజర్' మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు సుమారు రూ.51 కోట్లుగా ఉన్నట్టు తెలిసింది. కానీ మూవీ మేకర్స్ మాత్రం సినిమా ఏకంగా రూ.186 కోట్లు వసుళ్లు చేసినట్టు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.అంటే దాదాపు రూ. 100 కోట్లకు పైగానే తేడా కనిపించింది.

కలెక్షన్ల విషయంలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో , నిర్మాతలు వెనక్కి తగ్గారు. 'గేమ్ ఛేంజర్' రెండో రోజు నుంచి కలెక్షన్లు ప్రకటించడం ఆపేశారు.గేమ్ ఛేంజర్ కలెక్షన్లపై తాజాగా నిర్మాత దిల్ రాజు స్పందించారు. సినిమా పోస్టర్లపై ఎక్కువ కలెక్షన్లు చూపడంపై స్పందిస్తూ దీనిపై ఇండస్ట్రీలో అందరం కూర్చొని మాట్లాడుకుంటామని ఆయన తెలిపారు. నేను ఒక్కడినే దీనిపై మాట్లాడటం సరికాదు. అందరం చర్చించించుకోవాల్సిన విషయమని, కలెక్షన్లని ఎక్కువగా చూపించడం తప్పే అని దిల్ రాజు అన్నారు. ఇక గేమ్ ఛేంజర్ మూవీ 15 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 129.01 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దీని ఫలితంగానే "గేమ్ ఛేంజర్" బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవి చూసింది.రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్'ను నిర్మించారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.ఎంత తీసేసిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగానే నష్టాలను మిగిల్చేలా కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. గేమ్ ఛేంజర్ OTT విషయానికి వస్తే.. ఫిబ్రవరి రెండవ వారంలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. OTT రూల్స్ ప్రకారం ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications