అల్లు అర్జున్ పేరు కావాలనే చెప్పలేదు బ్రదర్..? మెగా కాంపౌండ్ డైరెక్టర్
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా వచ్చే గురువారం(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినీ యావత్తు మొత్తం కూడా పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తున్నారు. ప్యాన్ ఇండియా లేవల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పుష్ప-2కు పబ్లిసిటీ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్ అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని సినిమా యూనిట్‌కు అభినందనలు తెలిపారు. అంతే బాగానే ఉన్నప్పటికీ పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఓ దర్శకుడు అల్లు అర్జున్ పేరును కూడా పలవకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు బుచ్చిబాబు.

సుకుమార్ శిష్యుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బుచ్చిబాబు, తన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచియం చేస్తూ 'ఉప్పెన' సినిమాకు దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్‌తో తన రెండో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 'గేమ్ ఛేంజర్' పూర్తి అవ్వగానే బుచ్చిబాబు సినిమా ప్రారంభం కాబోతుంది.
'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బుచ్చిబాబు తన ప్రసంగంలో ఎక్కడా కూడా అల్లు అర్జున్ పేరును ప్రస్తావించలేదు. బుచ్చిబాబు వేదికపై మాట్లాడుతూ..తన గురువు సుకుమార్ ను ఓ రేంజ్ లో కొనియాడారు. పుష్ప ఒక బ్రాండ్ అని.. దానికి పబ్లిసిటీ అవసరం లేదని అన్నారు. ప్రజలు ఎక్కువ మాట్లాడుకునే మూవీ అదేనని అన్నారు.సినిమా విజయం సాధించాలని, నిర్మాతలకు మంచి లాభాలు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు బుచ్చిబాబు. అయితే తన స్పీచ్ లో అసలు అల్లు అర్జున్ ప్రస్తావనే తీసుకురాకపోవడం గమనార్హం. మెగా కాంపౌండ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన బుచ్చిబాబు, అల్లు అర్జున్ పేరు ఎత్తడానికి ఇష్టపడలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. ఈ కారణంగానే బుచ్చిబాబు అల్లు అర్జున్ పేరు చెప్పలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications