అందుకే రష్మికను మా సినిమా నుంచి తీసేసాం
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రష్మిక మందన్నా. ఈ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. ఇక పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ 'పుష్ప-2'తో పాటు నితిన్‌తో మరో సినిమా చేస్తోన్న హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

అయితే నితిన్ సినిమాలో రష్మికను తీసుకున్నట్టే తీసుకుని ఆ తర్వాత ఆమెను సినిమా నుంచి తొలగించారు. ఆ సినిమానే 'రాబిన్ హుడ్'.ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు వెంకీ కుడుముల వివరణ ఇచ్చారు. నిజానికి వెంకీ కుడుముల 'ఛలో' సినిమాతోనే రష్మిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'భీష్మ' సినిమాలో కూడా రష్మికకే హీరోయిన్‌గా అవకాశం కల్పించాడు వెంకీ కుడుముల. మూడో సినిమాలో కూడా తొలుత రష్మికను తీసుకున్నారు. అయితే ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకున్నారు. తాజాగా దీనిపై వెంకీ కుడుముల స్పందించారు.
రష్మికని తీసేసి శ్రీలీలని పెట్టుకోడానికి కారణం అదే : దర్శకుడు వెంకీ కుడుముల#VenkyKudumula #Rashmika #Robinhood pic.twitter.com/EzQ5T6G7hu
— Filmy Focus (@FilmyFocus) November 27, 2024
మా సినిమా ఒప్పుకునే టైంకి సమయానికి రష్మికకు హిందీలో రెండు చిత్రాలతో పాటు.. పుష్ప కూడా నటిస్తున్నారు. ఇక ఎప్పుడైతే మేము డేట్స్ ఇస్తున్నామో.. సేమ్ డేట్స్ మిగతా మూవీస్‌కు కూడా ఉన్నాయి. రెండు రోజులు, మూడు రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే అది ఎవరికి సెట్ కాదు. సరే ఇక ఈ సినిమా వరకు డ్రాప్ అవుదాం అని అనుకున్నాము. మేము అందరం కలిసి తీసుకున్నా నిర్ణయం ఇది అంటూ చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications