చిరంజీవితో సినిమాకు 'నో' చెప్పిన స్టార్ డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో కూడా తోటి ఆర్టిస్టులందరికీ ఎంతో అభిమానం, గౌరవం ఉంటాయి. చిన్నస్థాయి నుంచి కష్టపడుతూ మెగాస్టార్ స్థాయికి చేరుకున్న చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు తపిస్తుంటారు. పరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టేవారి నుంచి సీనియర్ డైరెక్టర్ల వరకు ఆయన డేట్లు ఇస్తే సినిమా చేయడానికి సిద్ధంగా ఉండేవారే ఎక్కువ. అయితే అటువంటి చిరంజీవికి కూడా నో చెప్పిన డైరెక్టర్ ఒకరు ఉన్నారు. ఎందుకు ఆయన చిరంజీవితో సినిమా చేయనన్నారో తెలుసుకుందాం.
సైరా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మంచి కమర్షియల్ హిట్ చిత్రం చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నారు. దీనికోసం ఆయన దర్శకుడు హరీష్ శంకర్ ను పిలిపించి మాట్లాడారు. అయితే హరీష్ దగ్గర అప్పటికప్పుడు కథ సిద్ధంగా లేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాక సినిమా చేయాలంటే తనకు ఒక సంవత్సరం సమయం కావాలని అడిగారు. కథ, కథనం ఎంతో జాగ్రత్తగా చూసుకొని అడుగు ముందుకు వేయాలని, లేదంటే సినిమా ఫ్లాపవుతుందనే ఉద్దేశంతో హరీష్ ఉన్నారు. అలా కాకుండా ఉండాలనే కథ, స్క్రీన్ ప్లే సిద్ధం చేయడానికి ఏడాది సమయం కోరారు.

అప్పటికప్పుడు స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్న బాబీ కథకు చిరంజీవి ఓకే చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. హరీష్ శంకర్ వదులుకున్న ఆ అవకాశం బాబీని వరించి సూపర్ హిట్ కొట్టేలా చేసింది. హరీష్ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్. అయితే ఆయనకు సరిపడా కథ లేదన్న ఉద్దేశంతోనే నో చెప్పారు. ప్రస్తుతం పవన్ తో ఓ సినిమా, రవితేజతో మరో సినిమా చేస్తున్నారు. ఎటువంటి కథతో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications