''మిస్టర్ బచ్చన్'' గొప్ప సినిమా కాదు.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్
''మిస్టర్ బచ్చన్'' సినిమా ఫలితంతో దర్శకుడు హరీష్ శంకర్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ''మిస్టర్ బచ్చన్'' ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవడం ఫెయిల్ అయిందని తెలుస్తోంది. సినిమా చూసిన వారు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. దీంతో మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. రవితేజ లైఫ్ ఇస్తే , ఆయన లైఫ్‌తోనే హరీష్ శంకర్ ఆడుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రీమేక్ సినిమాను ఇలా కూడా తీస్తారా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హీరోయిన్‌ను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారని, కథను బాగా సాగదీశాడని హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు. మీడియా అటెన్షన్‌పై ఉన్న శ్రద్ద సినిమాపై పెడితే బాగుండేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ''మిస్టర్ బచ్చన్'' నెగిటివ్ టాక్ రావడంతో రవితేజ అభిమానులు హరీష్ శంకర్‌పై గుర్రుగా ఉన్నారు. సినిమా వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది ఒక్క హీరోయిన్ మాత్రమే. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే, తన తొలి సినిమాతోనే అదరగొట్టింది.

సినిమా ఫలితం ఎలా ఉన్నా భాగ్యశ్రీ బోర్సే అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ ఫలితంపై దర్శకుడు హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు. ''మిస్టర్ బచ్చన్'' సినిమా మేం అనుకున్నంత గొప్ప సినిమా కాకపోవచ్చు. అదే విధంగా మరీ దారుణమైన సినిమా కూడా కాదని హరీష్ శంకర్ వ్యాఖ్యానించారు. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపించిన వారిలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒకరు.
సెలబ్రిటీలు మీడియా అంటే కాస్తా భయపడుతుంటారు. కానీ హరీష్ శంకర్ మాత్రం తనదైనశైలిలో మీడియాపైనే పంచ్‌లు వేస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హరీష్ శంకర్, తన సినిమా ఆప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తుంటారు. వారు అడిగిన ప్రశ్నలకు తనదైనశైలిలో సమాధానం కూడా ఇస్తుంటారు. ఇదే సమయంలో తనని ట్రోల్ చేసిని వారికి సైతం అదే రీతిలో కౌంటరిస్తుంటారు. పలు సందర్భాల్లో మీడియాపై తన వెటకారపు మాటలతో హరీష్ రెచ్చిపోతుంటారు. ''మిస్టర్ బచ్చన్'' ఫలితం తారుమారు కావడంతో ఇప్పుడు నెటిజన్లు ఆయన్ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
-
పెళ్లికి ముందే గొడవలు.. రష్మిక తల్లి వీడియో వైరల్! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
"20 ఏళ్ల క్రితం మీ అమ్మను చూసుంటే పెద్ద హీరోయిన్ ను చేసేవాడ్ని" -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
రోషన్ తో లవ్..?? ఓపెన్ అయిన 'కోర్ట్' మూవీ హీరోయిన్ శ్రీదేవి -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications