ఆ హీరోతో జీవితంలో సినిమా తీయను: కొరటాల శివ
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సంచలన వసూళ్ల దిశగా పయనిస్తోన్న విషయం తెలిసిందే. సినిమాకు మిక్స్ డ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం సునామీని తలపిస్తున్నాయి. ఇప్పటికే మూడు రోజులకు రూ.304 కోట్లు వసూలు చేసింది. మొదటి భాగం బాగుందని, రెండో భాగం సాగదీశారని, క్లైమాక్స్ తేలిపోయిందని కొందరు అంటుంటే మరికొందరు రెండో భాగం బాగుందంటున్నారు. టాక్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా రావడంతో అభిమానులు థియేటర్ల దగ్గర జాతర చేస్తున్నారు.
ఆ కథ వేరు.. ఈ కథ వేరు
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కొరటాల శివ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ తో సినిమా గురించి ప్రస్తావించగా, కచ్చితంగా బన్నీతో సినిమా ఉంటుందని, ఆ కథతోనే దేవర సినిమా చేశామని అనుకుంటున్నారని, కానీ అల్లు అర్జున్ కథ అలాగే ఉందని, అది బన్నీతోనే తీస్తానని చెప్పారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించి పోస్టర్ కూడా విడుదల చేశారు. కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఆగిపోయింది. కథలో ఏదో కొంచెం తేడాగా ఉందనే ఉద్దేశంతో బన్నీ నిరాకరించడంతో ఆ సినిమా అలాగే ఆగిపోయింది. అదే కచ్చితంగా ఉంటుందని కొరటాల చెబుతున్నారు.

రాజకీయాల్లో బిజీగా ఉన్నారు
పరిశ్రమలో అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు.. పవన్ కల్యాణ్ తో ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా.. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారని, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని, అంతేకాకుండా ఆయన చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయన్నారు. అవి పూర్తయిన తర్వాత ఆయన సినిమాలు చేస్తారో లేదో గ్యారంటీ లేదని, అప్పటికి రాజకీయాల్లో ఇంకా బిజీగా ఉంటారని, ఆ తర్వాత సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చనేది తన అభిప్రాయం అన్నారు. అటువంటప్పుడు పవన్ కల్యాణ్ తో సినిమా తీసే అవకాశం రాదన్నారు. పవన్ కల్యాణ్ తో సినిమా తీయడం అంటే కష్టమే అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.












Click it and Unblock the Notifications