అసలు విషయం చెప్పిన క్రిష్.. ఆ కారణం వల్లే హరిహర వీరమల్లు నుంచి ఔట్ !
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న " అనుష్క శెట్టి ". "అరుంధతి", "దేవసేన", "భాగమతి" లాంటి పాత్రలతో తన ప్రత్యేకతను నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి "ఘాటి"లో శీలావతిగా కనిపించనున్నారు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఆమె చేస్తున్న ఈ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ మూవీలో విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించారు. తూర్పు కనుమల్లో గంజాయి వ్యాపారం నేపథ్యంలో సాగే కథతో మూవీ రాబోతుంది.
UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. జగపతిబాబు, చైతన్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సాగర్ సంగీతం అందించగా .. సాయిమాధవ్ బుర్ర డైలాగులు రాశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాండ్ దక్కింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కాగా ఒక విలేకరి హరిహర వీరమల్లు గురించి ప్రశ్నించగా క్రిష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

హరిహర వీరమల్లుపై కామెంట్స్..
క్రిష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం.. నిర్మాత ఎ.ఎం. రత్నం మీద గౌరవం ఉంది. ఆ సినిమాను నేను కొంతవరకు డైరెక్ట్ చేశాను. కానీ కోవిడ్, వ్యక్తిగత కారణాల వల్ల షూటింగ్ షెడ్యూళ్లలో మార్పులు వచ్చాయి. అందుకే నేను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను. తర్వాత జ్యోతికృష్ణ ఆ సినిమాను కొనసాగించారు అని అన్నారు.
ఇక అనుష్క గురించు చెబుతూ.. అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి.. ఇలా ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ చేసింది. ఈ మూవీలో కూడా చాలా బాగా చేసిందని అన్నారు. వేదం నుంచి ఇప్పటివరకు స్టార్ డమ్ లో అనేక రెట్లు ఎదిగినా కానీ మనసు మాత్రం అలాగే ఉందని చెప్పారు. అనుష్క విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నామని తెలిపారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు'. మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ మూవీని.. జ్యోతి కృష్ణ ఫినిష్ చేశారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్ ఔరంగజేబుగా చేశారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందించారు. మొదట్లో ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. vfx విషయంలో మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. భారీ బడ్జెట్ తో వచ్చిన మూవీలో ఈ తరహా గ్రాఫిక్స్ ఏంటని గట్టిగా ట్రోల్స్ వచ్చాయి.












Click it and Unblock the Notifications