ప్రభాస్ సేఫ్.. జపాన్‌లో భారీ భూకంపంపై డైరెక్టర్ క్లారిటీ !
గ్లోబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆయన నటించిన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలను కలిపి.. "బాహుబలి ఎపిక్" పేరుతో రీసెంట్ గానే రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రానికి మళ్లీ నీరాజనాలు పలికారు. ప్రస్తుతం జపాన్ లో మన చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది.
గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 'ముత్తు' సినిమాతో జపాన్ లో కూడా భారీ హిట్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ సైతం మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత ఎన్టీఆర్ 'దేవర' సినిమా సైతం రిలీజ్ అవ్వగా.. త్వరలోనే పుష్ప 2 కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే జపాన్ లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ జపాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ అభిమానులను కలుస్తూ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న వీడియోలు సైతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇందుకు టాలీవుడ్ డైరెక్టర్ మారుతి వారికి రిప్లై ఇచ్చారు. ప్రభాస్ క్షేమంగా ఉన్నారని వెల్లడించడంతో ఫ్యాన్స్ కొంచెం కూల్ అవుతున్నారు.
అభిమాని పోస్టుకి రిప్లై..
సోషల్ మీడియాలో ఒక అభిమాని.. జపాన్ లో భూకంపం వచ్చింది.. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మా హీరో ఎక్కడ ఉన్నాడు.. ఈరోజు సాయంత్రం రిటర్న్ అవుతారా? అని మారుతిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. అందుకు మారుతి రిప్లై ఇస్తూ.. ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడానని.. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరని క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందకండి అని రిప్లై ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Japan lo Earthquake and Tsunami warning anta hero akkade unnadu repu return avuthunadu anta 🙏🙏
— Sagar (@SagarPrabhas141) December 8, 2025
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతితో "రాజా సాబ్" సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications