ఎన్టీఆర్‌కు హ్యాండిచ్చి అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్న దర్శకుడు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్ర రాజం వచ్చే నెల ఐదోతేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా యూనిట్ మొత్తానికి పుష్ప2 అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పుష్ప1 హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో సుకుమార్ అహర్నిశలు శ్రమిస్తూ పుష్ప2ను చెక్కుకుంటూ వస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడనేది కీలకమైన అంశంగా మారింది. మొదట్లో అట్లీ పేరు వినిపించిందికానీ రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో ఆ ప్రాజెక్టు రద్దయింది. అదే ప్రాజెక్టును అట్లీ సల్మాన్ ఖాన్ తో చేస్తున్నాడు.
కథ చెబుతానంటే అంగీకరించిన అల్లు అర్జున్
ప్రస్తుతం పుష్ప2 ప్రీ రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా తమిళ సీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఉన్నారు. ఇటీవలే రజనీకాంత్ జైలర్ తో తిరుగులేని విజయాన్ని సాధించిన నెల్సన్ జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ తో సినిమా చేయాలని, కథ కూడా చెప్పాడని వార్తలు వచ్చాయి. అయితే స్టేజీమీద నెల్సన్ బన్నీకి కథ చెప్పాలంటే ముందుగా ఆలోచించానని, తనకు తెలుగు రాదని, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తమిళంలో మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయానని, కథ చెబుతానని ప్రకటించాడు. దీనికి అల్లు అర్జున్ వెంటనే అంగీకరించాడు. అందుకు సూచనగా థంబ్సప్ సింబల్ చూపించారు.

ఎన్టీఆర్ తో ముగిసిన కథాచర్చలు
వాస్తవానికి ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన కథాచర్చలు కూడా ముగిశాయి. సితార బ్యానరులో ఈ సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు. అయితే అల్లు అర్జున్ సినిమా చేయడానికి అంగీకారం తెలిపిన తర్వాత దిలీప్ కుమార్ అల్లు అర్జున్ తో చేస్తారా? లేదంటే జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తారా? అనేది సందేహాస్పదంగా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీ సిద్ధమవుతున్నారు. ఇది పూర్తయిన తర్వాత దిలీప్ కుమార్ తో చేయొచ్చు అంటున్నారు. దిలీప్ కుమార్ తారక్ తో చేస్తాడా? లేదంటే బన్నీతో చేస్తాడా? అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications