తారక్... ఏమీ అనుకోవద్దు, అది చెత్త సినిమా: రాజమౌళి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళిది ప్రత్యేక కాంబినేషన్. తమ సినీ ప్రయాణంలో వీరిద్దరూ కొన్ని దశాబ్దాల నుంచి కలిసి ప్రయాణిస్తుండటమే కాకుండా మంచి స్నేహితులుగా ఉంటారు. ఎన్టీఆర్‌కు రాజమౌళి గైడ్‌లా వ్యవహరిస్తుంటారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. తర్వాత సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. మూడోసారి యమదొంగ చేయగా, నాలుగోసారి ఆర్ఆర్ఆర్ చేశారు. రాజమౌళి ఒక హీరోతో అన్నిసార్లు చేయడం అంటే అద్భుతం అని చెప్పొచ్చు. అలా ఉంటుంది వారిద్దరి మధ్య అనుబంధం. మహేష్ బాబుతో సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో మరో సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి సినిమా తీశానేంటి బాబూ..
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి, ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ ప్రేక్షకుల మైండ్ సెట్ నుంచి ఓ సినిమా తీసేయాలి? అంటే మీరు ఏ సినిమా తీసేస్తారు? అని ప్రశ్నించగా దానికి రాజమౌళి తడుముకోకుండా స్టూడెంట్ నెంబర్ వన్ అని చెప్పారు. ఈ సమాధానం చెప్పగానే తారక్ కాస్తంత ఇబ్బందిగా కదిలాడు. తాను ఆ సినిమా తీసిన సమయంలో అంత అనుభవం లేకుండా ఇలాంటి సినిమా తీశాను ఏంట్రాబాబూ అని చాలాసార్లు అనుకుంటానని రాజమౌళి చెప్పాడు. అంతేకాకుండా తన మొదటి సినిమాకు హీరో ఏంట్రాబాబూ ఇలా వున్నాడు అని చాలాసార్లు అనుకున్నానని రాజమౌళి చెప్పారు.

కుంటి గుర్రంతోనే రేస్ గెలవాలనుకున్నా..
సరేలే ఎలా ఉంటే మనకేంటి? మొదటి సినిమా కాబట్టి హీరో ఎలా సరేలే.. కుంటి గుర్రంతోనే రేస్ గెలిస్తే మజా ఉంటుంది అని తనను తాను సరిపెట్టుకున్నానన్నారు.
సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత తన అభిప్రాయం మారిపోయిందని, తారక్ అద్భుతమైన నటుడు అని, నవరసాలను పోషిస్తాడని, అన్ని హావభావాలను పలకలరిస్తాడంటూ కొనియాడారు. అయితే స్టూడెంట్ నెంబర్ వన్ చూసినప్పుడల్లా తాను తీవ్ర నిరుత్సాహానికి గురవుతానన్నారు. అప్పటికి తనకు ఇంకా పూర్తిస్థాయి అనుభవం రాలేదన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా రూ.1250 కోట్ల వరక కలెక్షన్లు సాధించగా, దేవర ఉత్తరాదిలో రూ.60 కోట్లు రాబట్టింది.












Click it and Unblock the Notifications