రాంగోపాల్ వర్మ లవ్ స్టోరీ లీక్.. కాల్ చేసి ప్రపోజ్ చేస్తే !
రామ్ గోపాల్ వర్మ.. తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించిన పేరు. 1990లో వచ్చిన ఆయన తొలి చిత్రం 'శివ' తో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. రియలిస్టిక్ మేకింగ్, కొత్త తరహా టెక్నిక్స్.. రఫ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా ఒక సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత 'క్షణక్షణం', 'గాయం', 'రాత్రి' వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు తీశాడు.
1998లో వచ్చిన ఆయన హిందీ చిత్రం 'సత్య' బాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఒక కొత్త ప్రామాణికం నెలకొల్పింది. బాలీవుడ్‌లో కూడా 'కంపెనీ', 'రోడ్', 'రన్', 'సర్కార్' వంటి విజయవంతమైన చిత్రాలు తీశారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్‌తో తీసిన 'సర్కార్' ఆయన కెరీర్‌లో ఒక హైలైట్‌గా నిలిచింది.

వివాదాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వర్మ.. తన సినిమాల ద్వారా ఎంతోమంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అలాగే, జగపతి బాబు వంటి నటుల ఇమేజ్‌ను మార్చి వారికి కొత్త అవకాశాలు ఇచ్చారు. కాగా ఇటీవల 'జయమ్మూ నిశ్చయమ్మురా' షోలో జగపతి బాబు, సందీప్ రెడ్డి వంగతో కలిసి వర్మ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. దీంతో వర్మ లవ్ మ్యాటర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
ఫస్ట్ లవ్..
జగపతి బాబు సరదాగా ఆయన మొదటి ప్రేమ గురించి అడగగా.. తన స్కూల్ టీచర్ సరస్వతిని ప్రేమించానని చెప్పారు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని చెప్పలేకపోయానని.. ఇటీవల ఆమెకు ఫోన్ చేసి "అప్పట్లో నేను మిమ్మల్ని ప్రేమించాను" అని చెప్పానని వెల్లడించారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె వయస్సు దాదాపు 80 ఏళ్లు అని చెప్పి అందరినీ నవ్వించారు. అయితే ఎప్పుడూ నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. "నాకు ఆడవాళ్లంటే చాలా ఇష్టం, కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు" అని పలు సందర్భాల్లో చెబుతుంటారు.












Click it and Unblock the Notifications