త్రివిక్రమ్ శ్రీనివాస్ మల్టీస్టారర్.. హీరోలు ఎవరంటే..?

మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కూడా సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. గతంలో విజయ్ భాస్కర్ చిత్రాలకు కథా రచయితగా , మాటల రచయితగా పనిచేసేవారు నువ్వేనువ్వే సినిమా నుంచి దర్శకత్వంలోకి అడుగుపెట్టారు. ఒకటి, రెండు సినిమాలు మినహా దాదాపుగా ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా లేదంటే సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు కారం చిత్రం చేస్తున్న త్రివిక్రమ్ దాని తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు.

అయితే అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్ లో ఉండటంతోపాటు అది ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. చాలా ఎక్కువ సమయం ఉండటంతో తాను రాసుకున్న కథతో ఒక మల్టీస్టారర్ ను ప్లాన్ చేశారు. ఇప్పటికే ఆ కథను ఇద్దరు హీరోలకు వినిపించడమే కాకుండా వారిచేత ఓకే అనిపించుకున్నారు. అయితే ఈ విషయాన్ని సినిమా ప్రారంభించేంత వరకు బయటకు తెలియనివ్వకుండా ఉండాలన్న ఉద్దేశంతో త్రివిక్రమ్ ఉన్నారు.

director trivikram srinivas multistarrer movie

వాస్తవానికి వెంకటేష్ సోలో హీరోగా సినిమా తీద్దామని త్రివిక్రమ్ భావించారు. అయితే కథ ప్రకారం ఇది మల్టీస్టారర్ అయితే బాగుంటుందని భావించి మరో హీరోగా నానిని ఎంపిక చేసుకున్నారు. వారిద్దరిని ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్ ఏ బ్యానర్ పై దీన్ని నిర్మించబోతున్నారు అనే స్పష్టత రాలేదు. అయితే ఈ సినిమా కామెడీ జోనరల్ లో ఉంటుందని, కథకు వెంకటేష్, నాని న్యాయం చేస్తారని ఆయన భావిస్తున్నారు. రహస్యంగా వీరిద్దరికీ కథ వినిపించి ఓకే అనిపించుకున్నారని, త్వరలోనే ఇది పెట్టాలెక్కబోతోందని తెలుగు ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+