సుమన్‌ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించింది అతనే..? చిరంజీవి పాత్ర బయటపెట్టిన దర్శకుడు
నటుడు సుమన్ గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు.ఈ తరం వారికి సుమన్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1990ల్లో సుమన్ క్రేజ్ మరో లేవల్లో ఉండేది. ఇంకా చెప్పాలంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల కంటే ముందుగానే సుమన్ హీరోగా స్టార్ స్టేటస్ పొందారు. ఎన్టీఆర్,ఏఎన్ఆర్, కృష్ణల తర్వాత తరంలో అందరికంటే సుమన్‌కే క్రేజ్ ఎక్కువగా ఉండేది.
అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి.దీంతో దర్శక, నిర్మాతలు సుమన్ చూట్టు తిరిగేవారు. అలాంటి సుమన్ ఎవరూ ఊహించని విధంగా బ్లూ ఫిలిం కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఆయన కెరీర్ మొత్తం నాశనం అయింది. అయితే సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి ఉన్నారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.ఈ ఆరోపణలను సుమన్ ఖండించారు. తన అరెస్ట్‌కు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని సుమన్ తెలిపారు.

సుమన్ అరెస్ట్ వెనుక ఏకంగా సీఎం పాత్ర ఉందనే ఆరోపణలు వినిపించాయి. సుమన్ పై అన్యాయంగా కేసులు పెట్టింటి ఆయన్ను ఎదగకుండా చేయడంతో పాటు.. బ్లూ ఫిల్మ్ చేస్తున్నాడంటూ కేసులో ఇరికించడం వెనుక సీఎం ఉన్నారనే వాదన తెర మీదకు వచ్చింది. ఆ సీఎం ఎవరో కాదు..అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి MGR. సుమన్ అరెస్ట్ వెనుక MGR పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వచ్చాయి.
అప్పటి డీజీపీ కూతురు సుమన్ అంటే పడిచచ్చిపోయేదట. సుమన్ షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లిపోయేదట. అయితే ఆ మహిళకు అప్పటికే పెళ్లి అయిందట. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినప్పటికీ వారి మాట వినకుండా , సుమన్ కోసం వెళ్లిపోయేదట. దీంతో ఈ విషయాన్ని ఆ మహిళ తండ్రి అయిన డీజీపీ, ముఖ్యమంత్రి MGR దృష్టికి తీసుకువెళ్లారట. ఈ విషయంపై సుమన్‌ను పిలిపించిన ముఖ్యమంత్రి MGR అసలు విషయాన్ని చెప్పారట.
అయితే ఈ విషయంలో కొంత దూకుడుగా మాట్లాడిన సుమన్, ఇది నాకు కాదు.. ఆ అమ్మాయికి చెప్పడంటూ ఆవేశంగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే సమన్ అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి MGR తమ అధికారం ఉపయోగించి సుమన్‌ను చేయించారనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. ఈ విషయాలను ఒక్కప్పటి దర్శకుడు సాగర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి కూడా ఉన్నారనే దాంట్లో ఎలాంటి నిజం లేదని..ఈవిషయంలో అసలు చిరంజీవి పాత్రలేదన్నారు. అవన్నీ కావాలని పుట్టించిన పుకార్లంటూ క్లారిటీ ఇచ్చారు సాగర్.
అయితే సుమన్ మాత్రం తన స్నేహితుడు దివాకర్ అనే వ్యక్తి వల్లే తాను అరెస్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఇందులో సినిమా వారికి , బయట వ్యక్తులకు సంబంధం లేదని ఓ ఇంటర్య్వలో వెల్లడించారు. దీంతో దర్శకుడు సాగర్ చెప్పిన దాంట్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. సుమన్ అరెస్ట్ కావడంతో అతనికి రావాల్సిన అవకాశాలు చిరంజీవికి దక్కాయి.దీంతో ఆయన స్టార్ హీరోగా ఎదిగారు.
-
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్!












Click it and Unblock the Notifications