పాప టాలెంట్ చూపిస్తోందిగా..!

ప్రముఖ స్టార్ హీరోయిన్ దిశా పటానీ అందాల ఆరబోతలో ముందుంటారనే సంగతి తెలిసిందే. ఆమె ఫ్యాషన్ సెన్స్‌‌ను చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతుందంటే అతిశయోక్తి లేదు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ లాక్మే ఫ్యాషన్ వీక్ 2026 వేదికపై దిశా పటానీ చేసిన సందడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో దిశా పటానీ ఓ బోల్డ్ అవుట్ ఫిట్‌లో ర్యాంప్‌పై మెరిసింది. అయితే ఆ డ్రెస్ వేసుకున్న సమయంలో దిశా పటానీ కొంత అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది. ముఖ్యంగా ఆమె తన డ్రెస్‌ను మాటిమాటికీ సరిచేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు దిశా పటానీ ఫ్యాషన్ ఎంపికపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

నెటిజన్ల విమర్శలు.. టాలెంట్ పై ప్రశ్నలు!
దిశా పటానీ కేవలం తాను లైమ్ లైట్‌లో ఉండటానికే ఇలాంటి విచిత్రమైన దుస్తులు ధరిస్తుందని కొందరు విమర్శిస్తుండగా.. మరికొందరు ఆమె నటన కంటే గ్లామర్ షోకే ప్రాధాన్యత ఇస్తుందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. డ్రెస్ విషయంలో అంత అసౌకర్యంగా ఉన్నప్పుడు దాన్ని ధరించాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

Disha Patani Trolled for Uncomfortable Outfit at Lakme Fashion Week 2026 Viral Video Sparks Debate

నటీమణులపైనే ఎక్కువ వివక్షా?
ఈ విమర్శల నేపథ్యంలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా తెరపైకి వచ్చింది. బాలీవుడ్‌లో హీరోల కంటే హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంలోనే ప్రేక్షకులు ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓ చిన్న పొరపాటు జరిగినా లేదా డ్రెస్ కొంచెం తేడాగా ఉన్నా నటీమణులు ప్రతిభను, వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చూసి మాట్లాడటం సరికాదని దిశా పటానీ అభిమానులు వాదిస్తున్నారు.

ఫ్యాషన్ కంటే సౌకర్యం కూడా కావాలి..
బాలీవుడ్‌లో ప్రస్తుతం యాక్టింగ్, బ్రాండింగ్, సోషల్ మీడియా అన్నీ కలిస్తేనే ఓ సెలబ్రిటీ హోదా వస్తుంది. అయితే ఈ క్రమంలో ఎంచుకున్న డ్రెస్సింగ్ సౌకర్యంగా లేనప్పుడు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. దుస్తులు సరిగా లేకపోతే ప్రేక్షకుల దృష్టి ఇతర విషయాలపై మళ్లడమే కాకుండా నెగటివిటీకి దారితీస్తుంది. కానీ ఓ సెలబ్రిటీ వేసుకున్న డ్రెస్‌ను బట్టి వారి కెరీర్ ను లేదా టాలెంట్ ను అంచనా వేయడం సమంచడం కాదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+