ఆ సినిమా హిట్ అన్నారు..100 కోట్లు వచ్చాయని డబ్బా కొట్టారు..అంతా ఫేక్..?

ఈ రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో , ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పడం కష్టం. సినిమాలు హిట్ కావాలంటే సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీని దాటుకుని బయటపడాల్సి ఉంది. అలా దాటుకుని వచ్చిన సినిమాలు మాత్రమే హిట్‌గా నిలుస్తున్నాయి. ఈ మధ్య సినిమా వాళ్లు కూడా బాగానే తెలివి మీరారు. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ , మా సినిమా హిట్ అని సెలబ్రేషన్స్ చేసుకోవడం ఫిల్మ్ మేకర్స్‌కు పరిపాటిగా మారింది. తాజాగా ఓ సినిమా విషయంలో సరిగ్గా ఇలానే జరిగింది. సినిమాకు వచ్చిన టాక్‌కు , వాళ్లు ప్రకటించిన కలెక్షన్లకు ఎక్కడా సంబంధం లేదనే ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఓ డిస్ట్రిబ్యూటర్ బయటకు వచ్చిన మరీ ఆ సినిమా వల్ల నష్టపోయామని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ సినిమా మరేదో కాదు...న్యాచురల్ స్టార్ నాని నటించి, నిర్మించిన హిట్-3.హిట్ సీక్వెల్‌‌లో భాగంగా హిట్-3 తెరకెక్కింది. ఈ సినిమాకు శైలేష్ కొలన్ దర్శకత్వం వహించారు. గతంలో వచ్చిన రెండు పార్టులు సూపర్ హిట్ కావడంతో, హిట్ -3పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.సినిమా హిట్ అని ఫిల్మ్ మేకర్స్‌ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.అయితే వాస్తవానికి హిట్ -3 సినిమా కొన్ని చోట్ల నష్టాలను మిగ్చినట్టు తెలుస్తోంది. పెట్టిన పెట్టుబడి కూడా ఈ సినిమా తీసుకురాలేపోయిందని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు.

Distributor says Hit-3 movie has made huge losses

తాజాగా ఓ డిస్ట్రిబ్యూటర్ ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. హిట్-3 సినిమా వల్ల తాము రూ.50 లక్షలు నష్టపోయామని తెలిపారు. కానీ ఈ విషయాలు ఎవరికీ తెలియదని, ఎవరూ పట్టించుకోరని ఆయన తెలిపారు. నిర్మాతలు సేఫ్ అవుతున్నారని, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారని సదరు డిస్ట్రిబ్యూటర్ ఈ ఇంటర్య్వూ సాక్షిగా చెప్పుకొచ్చారు.దీంతో హిట్ -3 బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై సినిమా హీరో, నిర్మాతైనా నాని ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+