నగ్నంగా ఎప్పుడైనా అలాంటి పని చేశావా..? తెలుగు హీరోయిన్‌కు తిక్క ప్రశ్న
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టి, నటిగా ఎదిగిన దివి వైద్య, ఇటీవలే ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో అభ్యంతరకరమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. బిగ్‌బాస్ సీజన్ 4లో తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దివి, ఆ తర్వాత చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. నయీం డైరీస్, మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం వంటి చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే, ఇటీవల యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో దివి, దెత్తడి హారికతో కలిసి పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నిఖిల్, బట్టలు లేకుండా ఎప్పుడైనా ఫొటోలు తీసుకున్నారా? అని దివి, హారికలను ప్రశ్నించారు. ఈ ప్రశ్న దివిని షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత ఎవరైనా మీకు ప్రైవేట్ ఫొటోలు పంపారా? అని మరో అభ్యంతరకరమైన ప్రశ్న అడిగారు.

నీ అసలు ఇంటెన్షన్ ఇది, ఇలాంటి ప్రశ్నలు ముందు అడగాలి కదా అంటూ నిఖిల్‌కు హారిక కౌంటర్ ఇచ్చింది. నేను అయితే నగ్నంగా ఫొటోలు తీసుకున్నానని చెప్పి షాకిచ్చింది హారిక. అలాగే నాకు చాలామంది ప్రైవేట్ ఫొటోల్ని పంపించారని హారిక తెలిపింది. అయితే హారిక చెప్పిన జవాబులకు దివి షాక్ అయింది. ఇలా ఎవరైనా చేస్తారా అంటూ షాక్‌కు గురైంది. తాను అయితే ఎప్పుడు అలాంటి పని చేయలేదని దివి చెప్పుకొచ్చింది. కానీ కొందరు ప్రైవేట్ ఫొటోలు నాకు పంపించినప్పుడు తాను చూశానని తెలిపింది.
ఈ ప్రశ్నలకు దివి, హారికలు ధైర్యంగా సమాధానమిచ్చినప్పటికీ, ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు నిఖిల్ ప్రశ్నలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి అపరిచితుల, అవమానకరమైన ప్రశ్నలు అడగడం ద్వారా ఇంటర్వ్యూ స్థాయిని తగ్గించారని, ఇది సరైన పద్ధతి కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications