అల్లు అర్జున్ వదిలేసిన బ్లాక్‌బస్టర్ సినిమాలు తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నారు. దీన్ని అంతర్జాతీయస్థాయి సినిమాగా విడుదల చేయడానికి స్ పిక్చర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీకపూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది కానీ దీపికా పదుకొనే పేరు ఒకటే అధికారికంగా ఖరారైంది. వచ్చే ఏడాది సినిమా విడుదల కాబోతోంది. అల్లు అర్జున్ చెల్లెలుగా నజ్రియా నజీం నటిస్తోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీబడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పుష్ప2 తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావడం, దీన్ని అంతర్జాతీయస్థాయిలో విడుదల చేస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

కథలు నచ్చలేదని, డేట్లు ఖాళీలేవని
అల్లు అర్జున్ తన కెరీర్ లో కొన్నిబ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాలను వదులుకున్నారు. కొన్ని కథలు నచ్చక, మరికొన్నిసార్లు డేట్లు ఖాళీలేక వాటిని వదులుకున్నారు. ఆయా కథలన్నీ వేరే హీరోలతో తెరకెక్కి సంచలన విజయాలు సాధించి వారికి స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టాయి. ముందుగా భద్రను వదులుకున్నారు. బోయపాటి శీనుకు మొదటి సినిమా. తారక్, బన్నీ వద్దనడంతో చివరకు రవితేజతో తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నాడు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, తమన్నా నటించి 100 పర్సెంట్ లవ్ కూడా బన్నీ వద్దన్నాడు. ఆ కథ తనకు సరికాదనడంతో చివరకు నాగచైతన్యతో తెరకెక్కించిన సుకుమార్ ఘనవిజయాన్ని అందుకున్నారు.

Do you know about the blockbuster movies that Allu Arjun turned down

ఆ సినిమాతోనే పరిశ్రమలోకి రావాల్సింది
తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా ద్వారానే అల్లు అర్జున్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కావాల్సి ఉంది. అయితే అది కుదరలేదు. అలాగే అర్జున్ రెడ్డి ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా ముందుగా బన్నీతో చేయాలనుకున్నప్పటికీ హీరో పాత్ర చాలా దారుణంగా ఉందనిపించి బన్నీ వెనకడుగు వేశాడు. అలా సంచలన సినిమాను వదులుకున్నాడు. అలాగే పరశురామ్ దర్శకత్వంలో చేయాల్సిన గీత గోవిందం సినిమాను కూడా వద్దన్నాడు. హీరో పాత్రకన్నా హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని, తన హీరోయిజానికి ఇబ్బంది అవుతుందని, అభిమానులు గొడవ చేస్తారనే కారణాలతో చేయనన్నాడు. విజయ్ దేవరకొండుకు మొదటి 100 కోట్ల సినిమాగా ఇది సంచలన విజయాన్ని అందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+