బాలకృష్ణ - ప్రభాస్ మధ్య జరిగిన వార్ గురించి తెలుసా?

తెలుగు సినీ రంగంలో చిరంజీవి, బాలకృష్ణ అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. వీరి సినిమాలు విడుదలై హిట్ అయితే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. వీరిద్దరి సినిమాలు విడుదలయ్యే సమయంలో యువ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేవారుకాదు. వీలు చూసుకొని కొంత సమయం తర్వాత విడుదల చేసేవారు. అయితే బాలయ్య సినిమా విడుదలయ్యే సమయంలో అప్పట్లో యువ హీరోగా ఉన్న ప్రస్తుత పాన్ ఇండియా స్టార్ రెండుసార్లు పోటీకి వచ్చాడు. అది కూడా భయపడుతూనే.. ఏమవుతుందో అనుకుంటూ విడుదల చేశాడు. అయితే బాలయ్య పోటీని తట్టుకుంటూ తాను విడుదల చేసిన రెండు సినిమాలను హిట్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ యువ హీరో ఎవరో కాదు.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.

వర్షం, లక్ష్మీ నరసింహా సూపర్ హిట్ అయ్యాయి
చిరంజీవి సినిమా అంజి, బాలయ్య సినిమా లక్ష్మీనరసింహ సంక్రాంతికి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలతోపాటు వర్షం సినిమాను కూడా విడుదల చేయాలని నిర్మాతలు భావించి అగ్ర హీరోల సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ విడుదల చేశారు. అంజి సినిమా ఫ్లాప్ కాగా లక్ష్మీ నరసింహా సూపర్ హిట్ అయింది. వీటితోపాటు విడుదలైన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ లోనే తొలిసారిగా బ్లాక్ బస్టర్ హిట్ ను డార్లింగ్ కు అందించింది. ఊహించనిరీతిలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ స్థానం సినీరంగంలో స్థిరమైంది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ అవుతుందనేది అందరికీ తెలిసిందే. ఛత్రపతి సినిమా చేసిన తర్వాత ప్రభాస్ పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి సినిమాలు చేస్తే తీవ్రంగా నిరాశపరిచాయి.

Do you know about the war between Balakrishna and Prabhas

ఏం చేయాలో అర్థం కాక డార్లింగ్ ఎంచుకున్నారు
దీంతో ఏ సినిమా చేయాలో అర్థం కాక కుటుంబ కథతో కూడిన డార్లింగ్ సినిమాను ఎంచుకున్నారు. కరుణాకరన్ దర్శకుడు కాగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. విడుదలకు ముందే ఈ సినిమా పాటలన్నీ హిట్ అయ్యాయి. సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సరిగ్గా వారానికి బాలయ్య బోయపాటి దర్శకత్వంలో మొదటిసారిగా చేసిన సింహా విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పటికే ఆకలిమీద ఉన్న బాలయ్య అభిమానులతోపాటు సినీ ప్రియులు కూడా ఈ సినిమాకు పట్టం కట్టారు. అలాగే డార్లింగ్ సినిమాను కూడా కుటుంబ ప్రేక్షకులు బాగా ఆదరించడంతో ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇలా రెండుసార్లు వీరిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీపడి ఇద్దరూ విజయం సాధించడం విశేషం. ఇలాంటి పరిణామాలు చాలా అరుదుగా జరుగుతుంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+