సినిమాలు ఫ్లాపవుతున్నా రోజుకు ఎంత సంపాదనో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కొన్నేళ్ల క్రితం 10 సినిమాలు చేశారు. అందులో కేవలం రెండు మాత్రమే హిట్ గా నిలిచాయి. అయితే సినిమా ఆడిందా? ఆడలేదా? అనేదాంతో సంబంధం లేకుండా తను మాత్రం భారీగా ఆర్జిస్తున్నారు. గత పది సంవత్సరాల కాలంలో హృతిక్ రోషన్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రధానంగా
హృతిక్... 2014లో వచ్చిన బ్యాంగ్ బ్యాంగ్ సినిమా సెమీ హిట్ గా నిలిచింది. 2016లో వచ్చి మొహంజదారో డిజాస్టర్ గా నిలిచింది. రూ .138 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.74 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. అంచనాలు అందుకోలేక చతికిలపడింది.
2017 లో కాబిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 2019లో సూపర్ 30 సినిమాలో నటించి మంచి విజయాన్ని సాధించారు. దాని తర్వాత వచ్చిన వార్ చిత్రం కూడా కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ అనిపించుకుంది. 2022లో భారీ అంచనాల మధ్య విడుదలైన విక్రం వేద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం హృతిక్ వయసు 51 ఏళ్లు.

అయితే ఇన్ని సంవత్సరాల వయసు వచ్చినా సంపాదనలో మాత్రం ఆయన తగ్గడంలేదు. 2014 నుంచి ఆయన రోజుకు రూ.3.28 లక్షలు సంపాదిస్తున్నారు. అదేంటి.. సినిమాలన్నీ ఫ్లాపవుతున్నా ఆయనకు అంత సంపాదన ఎలా వస్తోందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 2020 నాటికి హృతిక్ ఆస్తి విలువ రూ.162 కోట్లు దాటింది. ముంబయిలో విలాసవంతమైన బంగళాలు, లగ్జరీకార్లు కూడా ఉన్నాయి. జుహు ప్రాంతంలో రూ.100 కోట్లకు పైగా ఖరీదు చేసే అపార్ట్ మెంట్ ఉంది. వీటితోపాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి.
రూ.7 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ కారు, బీఎండబ్ల్యూతో సహా అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఒక్క సినిమాకి రూ.85 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఫైటర్, వార్ -3, క్రిష్ 2 సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications