కల్కి కోసం దీపికా తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ నటి దీపికా పదుకుణే పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. బాలీవుడ్‌లో మొదటి సినిమాలో షారూక్‌ఖాన్ వంటి పెద్ద స్టార్‌లతో నటించే అవకాశం దక్కించింది. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్‌లో ఆరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతినిండా పలు ప్రాజెక్టులతో ఈ అమ్మడు ఫుల్ బిజిగా ఉంది. ఈ బ్యూటీ తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి కల్కి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రోజురోజుకూ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా న్యూస్ వస్తున్నాయి. అయితే, ఈ మూవీ కోసం దీపికా తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పడు నెట్టింట్లో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం దీపిక ఎంత వసూలు చేసారనే విషయం బయటపడింది. దీంతో ఇది కాస్త సోషల్‌మీడియాలో హాల్చల్ చేస్తోంది.
కల్కి సినిమా కోసం దీపికా ఏకంగా రూ. 15 కోట్లు దాకా అందుకున్నట్లు బీటౌన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. సాధారణంగా దీపికా ఒక్క సినిమా కోసం రూ.15 నుండి 30 కోట్లకు వరకు డిమాండ్ చేస్తుందని టాక్. ఇక 'కల్కి 2898 AD' కోసం తను రూ.20 కోట్లకు పైగానే అడిగినట్లు తెలుస్తోంది. దీపికా హీరోయిన్‌గా నటించిన 'పఠాన్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసింది. ఇక, ఈ చిత్రం భారీ వసూళ్లనే రాబట్టింది. మరో చిత్రం జవాన్‌లో కూడా ఈ అమ్మడు మెరిసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. దీంతో దీపికా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కో సినిమాకు రూ. 20 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్స్ మరెందరో...
ఇక, కల్కి సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ చిత్రం ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథతో సాగుతున్నట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రం రాబోతుంది. అశ్వినీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, ఇందులో బాలీవుడ్ స్టార్స్ చాలామందే నటిస్తున్నారు. అందులో ముఖ్యంగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దిశా పటానీ, దీపికా పదుకొణె వంటివారు ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications