శ్రీలీల కట్టుకున్న చీర ఎంత ఖరీదైందో తెలుసా?
ప్రస్తుతం అందరూ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ చినబాబు, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. తమన్ స్వరాలందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12న విడుదల కాబోతోంది. అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.
గుంటూరు కారంకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా జరిగింది. అభిమానులంతా సినిమా సూపర్ హిట్ అనే ధీమాతో ఉన్నారు. ఈ ఈవెంట్ కు హాజరైన శ్రీలీలమీదే అందరి కళ్లు పడ్డాయి. ఆమె కట్టుకున్న చీరే అందుకు కారణం. ఆ చీరలో శ్రీలీల ఎంతో అందంగా మెరిసిపోయింది. వేడుకలో పాల్గొనడానికి వచ్చనవారిదగ్గర నుంచి అభిమానుల వరకు అందరి కళ్లు శ్రీలీలమీదే నిలిచిపోయాయి. ప్రస్తుతం అమ్మాయిలంతా శ్రీలీల కట్టుకున్న చీర గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు.

ఈ బాటిల్ గ్రీన్ డిజైన్ చీర అక్షరాలా లక్షా 59 వేల రూపాయలు అని తెలిసిన తర్వాత అందరూ ఖంగు తింటున్నారు. శ్రీలీల ఎంతో ఇష్టపడి దీన్ని డిజైన్ చేయించుకుంది. ఆమె టేస్ట్ కు జనాలంతా ఫిదా అయ్యారని చెప్పొచ్చు. శ్రీలీలను అందరూ తెగ పొగిడేస్తున్నారు. నీ అందానికి, నీ టేస్ట్ కు నువ్వు మరికొన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతావాంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏడు నుంచి ఎనిమిది సినిమాల వరకు ఉన్నాయి. తెలుగు పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆమె పేరే మార్మోగిపోతోంది. నటనతోపాటు అందం కూడా ఆమెకు ప్లస్ పాయింట్ అయింది.












Click it and Unblock the Notifications