హీరో నాని అసలు పేరు ఏంటో తెలుసా..?

తెలుగు యంగ్ హీరోల్లో నాని కూడా ఒకరు. నాని క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో నానికి విపరీతమైన పాపులారిటీ ఉంది. తనదైన నటనతో నాని అన్ని వర్గాల ప్రేక్షకులను నాని ఆకట్టుకుంటున్నాడు. తన నటనకు తగ్గట్టుగానే న్యాచురల్ స్టార్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నాడు. నాని తన సినీ ప్రయాణాన్ని సహాయ దర్శకుడిగా ప్రారంభించి, ఆ తర్వాత నటుడిగా మారారు. ఆయన తన సహజమైన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని, వరుస సినిమాల్లో నటించారు.రైడ్,స్నేహితుడా,అలా మొదలైంది,ఈగ,ఎవడే సుబ్రమణ్యం,భలే భలే మగాడివోయ్,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ,నేను లోకల్,నిన్ను కోరి,ఎం.సి.ఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి),జెర్సీ,శ్యామ్ సింగ రాయ్,అంటే సుందరానికి,దసరా,హాయ్ నాన్న వంటి హిట్ సినిమాలు నాని ఖాతాలో ఉన్నాయి. నాని నటుడిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు. ఆయన 'డి ఫర్ దోపిడి' అనే సినిమాను నిర్మించారు. అలాగే, 'బిగ్ బాస్ తెలుగు 2' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Do you know the real name of hero Nani

అయితే హీరో నాని అసలు పేరు మాత్రం చాలామంది తెలియదు. ఓ సందర్భంలో నాని అసలు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. చిన్నప్పుడు నుంచి నాని అనే పిలిచే వారని చెప్పి, తన అసలు పేరు చెప్పకుండా తప్పించుకున్నారు. నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తన పేరు నానిగా మార్చుకున్నారు. నాని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో జన్మించారు. ఆయన ప్రస్తుతం హిట్-3 సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై అందర్నీ ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+