రష్మిక టాటూ వెనుక ఉన్న సీక్రెట్ ఎంటో తెలుసా..?
గీతగోవిందం సినిమాతో రష్మిక మందన్నా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీకి అన్నీ మంచి ఆఫర్లే. అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిపోయింది. పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో ఆమెకున్న క్రేజ్ మరింత రెట్టింపయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజి అయిపోయింది. ఏప్రిల్ 5 అంటే నేడు రష్మిక పుట్టినరోజు. అయితే, రష్మిక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలోని విజయాలతోపాటు తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకుంది. అందులో తన చేతిపై ఉన్న టాటూ గురించి కూడా బయటపెట్టింది. అదేంటో తెలుసుకుందాం పదండి..
రష్మిక చేతిపై ఉన్న టాటూ గురించి ఆమె మాటల్లోనే విందాం. " నాకు టాటూ వేయించుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ లేదు. నేను కాలేజీలో ఉన్నప్పడు ఓ అబ్బాయి 'ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేరు. వాళ్లకు సూదులన్నా కూడా భయమే' అని అన్నాడు. దాంతో ఆ మాటలు తప్పు అని నిరూపించాలని అనుకున్నాను. అందుకే నేను కూడా టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ టాటూ ఏమని వేయించుకోవాలో తెలియలేదు. అస్సలు అనుకోలేదు కూడా. ఈ విషయంపై చాలా సేపు ఆలోచించాను. నాకు ఓ ఆలోచన వచ్చింది. ఇర్రీప్లేసబుల్ (Irreplaceable) అని టాటూ వేయించుకున్నాను. అంటే ఎవరూ మరొకరిని భర్తీ చేయలేరని ఆ టాటూ అర్థం. ఇదే విషయాన్ని నేను బాగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. అందుకే ఆ పదాన్ని వేయించుకున్నా.. అంటూ రష్మిక తెలిపారు.

ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కోసం ఐదు భాషల్లో డబ్బింగ్..
రష్మిక ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. పుష్ప 2 సినిమా షూటింగ్, ది గర్లఫ్రెండ్ వంటి ప్రాజెక్టులు ఉన్నారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 5 రష్మిక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు. అంటే నేడే ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్నిస్వయంగా దర్శకుడు రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం రష్మిక స్వయంగా ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పిందని టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
It’s a working holi for us.. but I hope you all are playing safe holi and enjoying yourselves 💃🏻💃🏻💃🏻
— Rashmika Mandanna (@iamRashmika) March 25, 2024
Here’s us wishing you all a very Happy Holi.. ❤️🫶🏻✨ pic.twitter.com/xvxhx1JODo












Click it and Unblock the Notifications