'సలార్' నేర్పుతున్న పాఠం ఏమిటో తెలుసా?

ఇటీవలి కాలంలో సినిమా పరిశ్రమలో ఏ తరహా చిత్రాలు తెరకెక్కుతున్నాయో చూస్తున్నాం. అర్థ నగ్నంగా, ముప్పావు నగ్నంగా కనపడటం, ముద్దు పేరుతో పెదాలు పెనవేసుకోవడం, రొమాంటిక్ హగ్గులు.. ఇలా ఒక తరహా అని కాకుండా శృంగారానికున్న విలువలను కూడా వలువలూడదీసినట్లు తీస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వారిదగ్గర సమాధానం ఉండదు.

ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మేం తీస్తున్నాం అంటారేకానీ సమాజంపై బాధ్యత మాత్రం తీసుకోరరు. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు చూసేవారికి లేని బాధ వీరికెందుకో అనే కామెంట్స్ మాత్రం వస్తుంటాయి. సినీ విశ్లేషకులు మాత్రం సలార్ సినిమా చూసిన తర్వాత బాగా స్పందిస్తున్నారు. ప్రభాస్ నటించిన తాజా సంచలనం సలార్ సినిమా బాక్సాఫీస్ పునాదులను కదిలిస్తోంది. గతంలో ఉన్న లెక్కలను తిరగరాస్తోంది. సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది.

Do you know what lesson Salar movie is teaching?

సినిమాలో ఎక్కడా ఒక్క వల్గర్ సీన్ కూడా లేదు. ముద్దుల్లేవు.. హగ్గుల్లేవు... అయినా సరే ప్రేక్షకులు మాత్రం దీన్ని బాగా ఆదరించారు . సినిమా మొత్తం మంచి కథ, కథనంతో ముందుకు వెళ్లింది. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను చూడొచ్చు. ఇటీవలి కాలంలో కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమానే రాలేదు.. ఒక్క హాయ్ నాన్న మినహా.

పిచ్చి పిచ్చి డైలాగులు లేవు.. అసభ్యకరమైన పదజాలం ఎక్కడా ఉపయోగించలేదు.. అలాంటి సినిమా రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసేదిగా ముందుకు దూసుకుపోతోంది. దీన్ని ఆదరించినప్పుడు మిగతా సినిమాలను కూడా ఆదరించాలని కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అటువంటివారికి కథను నమ్ముకోండి.. నగ్నం, అర్థనగ్నాన్ని కాదు అంటూ సినీ విశ్లేషకులు ఘాటుగా స్పందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+