పెళ్లిచూపుల్లో రామ్‌చరణ్‌ను ఉపాసన ఏ ప్రశ్న అడిగిందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రామ్ చరణ్-ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. పాన్ ఇండియా హీరోగా రామ్ చరణ్ గుర్తింపు తెచ్చుకోగా, అపోలో హాస్పటల్ డైరెక్టర్ గా ఉపాసన పేరు తెచ్చుకుంది. ఈ జంట కొన్ని సంవత్సరాలు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి వివాహమైన 11 సంవత్సరాల తర్వాత క్లీంకార అనే పాప జన్మించింది. ఆ పాప జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి బాగా కలిసివస్తోందనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు.

ఉపాసన అడిగిన ప్రశ్నకు చిరంజీవి షాక్
రామ్ చరణ్ - ఉపాసన ప్రేమించుకున్నారని, ఇద్దరూ పెళ్లి చేసుకుంటామంటున్నారని పెద్దలకు తెలియజేశారు. దీంతో సాంప్రదాయ పద్ధతిలో ఇరు కుటుంబాలు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. ఏం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? ఆదాయం ఎంత? లక్ష్యం ఏంటి? కుటుంబ వివరాల్లాంటివన్నీ పెళ్లిచూపుల్లో ప్రశ్నలుగా వస్తాయి. అలాగే ఉపాసన కూడా ఓ ప్రశ్న రామ్ చరణ్ ను అడిగించింది. పెళ్లయిన తర్వాత మీరు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? నాకిస్తారా? మీ అమ్మగారికి ఇస్తారా? అని అడిగింది. ఈ ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి కూడా షాక్ అయినట్లు తెలిసింది.

Do you know what question Upasana asked Ramcharan at the wedding

చప్పట్లు కొట్టి అభినందించారు
అయితే ఉపాసన అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ చాలా లౌక్యంగా సమాధానం చెప్పాడు. తల్లిని ప్రేమించే ప్రతి కొడుకు తన భార్యను కూడా ప్రేమిస్తాడు. ప్రతి స్త్రీని గౌరవిస్తాడు. ఇద్దరినీ బాగా చూసుకుంటాడు. భార్యను కూడా బాగా చూసుకుంటాడు అనే సమాధానం ఇచ్చాడు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టి రామ్ చరణ్ చెప్పిన సమాధానాన్ని మెచ్చుకున్నారు. గతంలో ఎప్పుడో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+