సంపాదించే డబ్బును రాజమౌళి ఏం చేస్తున్నారో తెలుసా?
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా, ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి సినిమా ఇంతవరకు ఫెయిలవలేదు.. అంత జాగ్రత్తగా సినిమాను తీసి నిర్మాతకు లాభాల పంటను పండిస్తారు. రాజమౌళి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారనే ప్రశ్న తరుచుగా ఉత్పన్నమవుతుంటుంది. అయితే పారితోషికంగా కొంత నగదుతోపాటు సినిమా లాభాల్లో వాటా తీసుకుంటారు.
రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా రికార్డులు సృష్టించడమే కాబట్టి లాభాల్లో వాటా ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోన్న రాజమౌళి ఆ డబ్బును ఏం చేస్తున్నారు? ఎక్కడ పెట్టుబడిగా పెడుతున్నారు? డబ్బులను ఎలా ఖర్చుచేస్తారు? అనే విషయాల్లో సినీ ప్రేక్షకులతోపాటు అందరి హీరోల అభిమానుల్లోను ఆసక్తి రేకెత్తుతుంటుంది.

తనకు వచ్చిన ఆదాయాన్ని రాజమౌళి ఫుడ్ బిజినెస్ లో, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతుంటారు. భవిష్యత్తులో సినిమాల నుంచి విరమించుకున్న తర్వాతకూడా ఎటువంటి ఆదాయం లేకుండా ఉండకూడదని, రెగ్యులర్ గా ఆదాయాన్ని సృష్టించుకోవాలనేది తన ఆలోచనగా సన్నిహితులు చెబుతున్నారు. ఆయన భార్య రమా రాజమౌళి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి డబ్బుకు చాలా ప్రాధాన్యతనిస్తారని, ఎంత సంపాదిస్తున్నప్పటికీ ఖర్చు చేసే ప్రతి రూపాయిని దగ్గరుండి లెక్కిస్తుంటారని వెల్లడించారు. ఎందుకంటే డబ్బు చాలా ముఖ్యమైనదని, ఒకవేళ అది పోతే తిరిగి రాదని, దాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారని చెప్పారు.
ప్రస్తుతం మహేష్ తో సినిమాకు సిద్ధమవుతున్న రాజమౌళి దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా, దానితర్వాత మహాభారతం తీసి సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పబోతున్నారు. తర్వాత వ్యవసాయ రంగంలో స్థిరపడదామనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications