తమన్నా ఇంత చండాలమైన పని చేస్తుందని అనుకోలేదు బాసూ..!
తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు కావస్తున్నా, తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా తెలుగు సినిమాల ద్వారానే ఆమె విశేషమైన గుర్తింపు పొందారు. తెలుగులో దాదాపు అందరు టాప్ హీరోలతోనూ కలిసి నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
ఒకానొక దశలో ఆఫర్లు తగ్గినప్పటికీ, తమన్నా మళ్లీ పుంజుకుని వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఆమె అందం, అభినయం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

తమన్నా భాటియాను తెలుగు ప్రేక్షకులు ముద్దుగా "మిల్కీ బ్యూటీ" అని పిలుచుకుంటారు.తమన్నా అందం, అభినయంతో ప్రేక్షకులను 20 ఏళ్లుగా ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఆమె ఫిట్‌నెస్ తమన్నా అందాన్ని మరింత పెంచుతున్నాయి. వయసు పెరుగుతున్నా ఆమె అందం మరింత మెరుగుపడుతోందని అభిమానులు చెబుతుంటారు.
ఇదిలా ఉంటే తన అందం గురించి తమన్నా ఓ సీక్రెట్‌ను బయటపెట్టింది. తమన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన అందమైన, మచ్చలేని చర్మం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని వెల్లడించింది.మొటిమలు,వాటి మచ్చలను తగ్గించుకోవడానికి తాను ఒక ప్రత్యేకమైన చిట్కాను పాటిస్తానని చెప్పారు. ఉదయం లేవగానే బ్రష్ చేయకముందే తన నోటిలోని సలైవా (ఉమ్మి)ను మొటిమలపై రాసుకుంటానని తెలిపింది. ఉదయం పూట సలైవాలో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉంటాయని, అవి మొటిమలను, వాటి మచ్చలను తొలగిస్తాయని తమన్నా వివరించింది.
ఈ చిట్కా తనకు వ్యక్తిగతంగా చాలా బాగా పని చేసిందని, దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని తాను నమ్ముతున్నానని ఆమె తెలిపారు. తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై కొంతమంది అసహ్యం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది ఈ సహజ పద్ధతిని సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications