రజనీకాంత్ - శ్రీదేవి ప్రేమకు అడ్డుపడింది ఎవరో తెలుసా?

ఇండియాలో మొదటి సూపర్ స్టార్ రజనీకాంత్. ఇప్పటికే కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఆయన స్టార్ డమ్ ను అందుకునే హీరోలు ఇంకా పరిశ్రమలో లేరంటే అతిశయోక్తికాదు. అంతటి క్రేజ్ ను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సినిమా షూటింగ్ లేనప్పుడు ప్రశాంతత కోసం, భగవంతుడి ఉనికి కోసం ఆయన హిమాలయాలకు వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం కూలీ సినిమా చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన విడుదల కాబోతోంది. రజనీకాంత్ గురించి గతంలో జరిగిన ఒక విషయాన్ని తెలుసుకుందాం. అది కూడా ఆయనకు వివాహం జరగకముందు సంగతి.

రజనీ కోసం వారం రోజుల ఉపవాసం
రజనీ తన కెరీర్ ప్రారంభంలో అందాల తార శ్రీదేవిని ప్రేమించారు. తాను ప్రేమించాను అనే విషయాన్ని శ్రీదేవికి తెలిపే సమయంలో ఒకరు అడ్డుపడటంతో ఆయన వెనకంజ వేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన ప్రేమకు అడ్డుపడింది మనుషులుకాదు.. కరెంటు. అవును మీరు చదివేది వాస్తవమే. కరెంటు ఆయన ప్రేమకు అడ్డుపడంది. రజనీకాంత్, శ్రీదేవి కలిసి 18 సినిమాల్లో నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉండేది. ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం ఉండేది. ఒక సమయంలో రజనీకి తీవ్ర అనారోగ్యం చేసింది. ఆయన అనారోగ్యం తగ్గి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ శ్రీదేవి వారం రోజులు ఉపవాసం ఉంది.

Do you know who got in the way of Rajinikanth-Sridevi s love

బాలచందర్ చెప్పే వరకు తెలియదు
గతంలోలా ఉండాలి అని మొక్కుకొని మరీ ఉపవాసం చేసింది. అలాంటి దృఢమైన బంధం వారిద్దరి మధ్య ఉండేది. ఓ సందర్భంలో తన ప్రేమ విషయం శ్రీదేవికి తెలియజెప్పి పెళ్లి వరకు తీసుకువెళ్లాలని అనుకున్నారు. ఓ రోజు శ్రీదేవి తన కొత్త ఇంట్లోకి వెళ్లేందుకు గృహప్రవేశం చేస్తోంది. ఆరోజు మంచిరోజుగా భావించిన రజనీ విషయం చెప్పడానికి ఇంటికి వెళ్లారు. సరిగ్గా మాట్లాడే సమయంలో కెరెంటు పోయిది. దీన్ని ఆయన అపశకునంలా భావించారు. విషయాన్ని చెప్పకుండా తిరిగివచ్చేశారు. అలా.. అది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఇద్దరికీ వేరేవారితో వివాహం జరిగిపోయింది. రజనీకాంత్ కు స్వయంగా గురువు అయిన కె.బాలచందర్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+