పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికి ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

లక్షలాది అభిమానులు ఆయన్ను అభిమానిస్తుంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం పవన్ కల్యాణ్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన పవన్ అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పవన్‌కు అసలు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది కాదట.

Do you know who is Pawan Kalyan s first crush

చిరంజీవి భార్య సురేఖ ఒత్తిడితోనే సినిమాల్లోకి వచ్చానని పవన్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్‌కు ఫస్ట్ క్రష్ ఎవరనే ప్రశ్న నెట్టింట వైరల్‌గా మారింది. ఒకనొక సందర్భంలో తన ఫస్ట్ క్రష్ గురించి పవన్ కల్యాణే చెప్పడం జరిగింది. పవన్ ఫస్ట్ క్రష్ ఎంటో తెలిస్తే షాక్ అవుతారు. ఆయన ఫస్ట్ క్రష్ రివాల్వర్.. అవును నిజమే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గన్ అంట.

Do you know who is Pawan Kalyan s first crush

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. తాను చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకునేది రివాల్వరే అని ఆయన తెలిపారు. రివాల్వర్ గురించి మాట్లాడుతూ.. నాకు రివాల్వర్ అంటే చాలా ఇష్టం. నేను మొదట ఎఫైర్ పెట్టుకుంది రివాల్వర్‌తోనేనని పవన్ చెప్పుకొచ్చారు. ఈ విషయం గమనించిన అన్నయ్య(చిరంజీవి) నేను ఎక్కడ ఉగ్రవాద ఉద్యమాల్లో తిరుగుతానేమోనని భయపడి వెంటనే సొంతంగా లైసెన్స్ గన్‌ను కొనిచ్చారు. నిద్రపోయేప్పుడు కూడా పక్కలోనే పెట్టుకుని పడుకునే వాడినని లేవగానే ఫస్ట్ కిస్ దానికే ఇచ్చానని.. అదే నా ఫస్ట్ లవ్ అని పవన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+