అబ్బో మరీ దారుణం.. అడ్వాన్స్ బుకింగ్స్ "రెండు టికెట్లే" !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన డాక్యుమెంటరీ "మెలానియా". నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. అయితే విడుదలకు ముందే యూకేలో ఈ డాక్యుమెంటరీ కోసం 100కి పైగా థియేటర్లు కేటాయించారు. అయితే ఇక్కడే ఊహించిన స్థాయిలో ఈ మూవీకి బిగ్ షాక్ తగిలింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినంతగా లేకపోవడంతో.. ఈ సినిమా ఆరంభం బలహీనంగానే ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా లండన్‌లోని ఇస్లింగ్టన్ ప్రాంతంలోని వ్యూ ప్రధాన థియేటర్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3:10 షోకు కేవలం ఒక్క టికెట్ మాత్రమే అమ్ముడవ్వగా.. అదే రోజు సాయంత్రం 6 గంటల షోకు రెండు టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. ఈ గణాంకాలు యూకే సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ పరిస్థితులపై స్పందించిన వ్యూ సీఈఓ టిమ్ రిచర్డ్స్, ఈ సినిమాను ప్రదర్శించడంపై తమకు పెద్ద సంఖ్యలో విమర్శాత్మక ఈమెయిల్స్ వచ్చినట్టు తెలిపారు.

అయితే బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (BBFC) నుంచి అనుమతి లభించిన సినిమాలను ప్రదర్శించడం తమ బాధ్యత అని, తాము సెన్సార్ సంస్థలా వ్యవహరించలేమని ఆయన స్పష్టం చేశారు. సినిమాపై వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, థియేటర్ నిర్వాహకుల బాధ్యత వేరు అని వ్యాఖ్యానించారు. యూకే బాక్సాఫీస్ వద్ద 'మెలానియా'కి గట్టి పోటీ కూడా ఎదురవుతోంది. అదే సమయంలో జేసన్ స్టాథమ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం, కొన్ని కొత్త హారర్ సినిమాలు, అలాగే ప్రముఖ దర్శకుడు రిచర్డ్ లింక్‌లేటర్ తెరకెక్కించిన చిత్రం విడుదలకు రావడంతో ప్రేక్షకుల దృష్టి ఇతర సినిమాల వైపు మళ్లిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్, థ్రిల్లర్ జానర్ సినిమాలపై యూకే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉండటం కూడా ఈ డాక్యుమెంటరీకి ప్రతికూలంగా మారిందని చెబుతున్నారు.
స్టోరీ ఇదే..
ఈ డాక్యుమెంటరీలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు జరిగిన 20 రోజుల మెలానియా ట్రంప్ జీవితాన్ని ప్రధానంగా చూపించినట్టు సమాచారం. రాజకీయ వాతావరణం, వ్యక్తిగత జీవితం, ఫస్ట్ లేడీగా ఆమె ఎదుర్కొన్న ఒత్తిడులు వంటి అంశాలు ఇందులో ప్రాధాన్యత పొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అమెజాన్ సంస్థ సుమారు 40 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిందని వార్తలు ఉన్నాయి. అలాగే ఈ డాక్యుమెంటరీ కోసం మెలానియా ట్రంప్‌కు దాదాపు 28 మిలియన్ డాలర్లు పారితోషికంగా ఇచ్చినట్టు కథనాలు చెబుతున్నాయి. సినిమా నిడివి సుమారు 104 నిమిషాలు కాగా, ప్రీమియం డాక్యుమెంటరీగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
-
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications