Don’t Trouble the Trouble Movie Review: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?

Don't Trouble the Trouble Movie Review: మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తొలిసారిగా పూర్తిస్థాయి సోలో హీరోగా నటించిన తెలుగు సినిమా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్ఎస్ కార్తికేయ నిర్మించారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో వచ్చిన ఈ ఫాంటసీ కామెడీ చిత్రం నేడు(అక్టోబర్ 2) థియేటర్లలోకి వచ్చింది. ప్రీ-రిలీజ్ ప్రమోషన్లతో మంచి అంచనాలను పెంచిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

అల్లు అర్జున్ 'రాకా' నుంచి అద్దిరిపోయే అప్డేట్.. ఇదే కానీ నిజమైతే..!
అల్లు అర్జున్ 'రాకా' నుంచి అద్దిరిపోయే అప్డేట్.. ఇదే కానీ నిజమైతే..!

స్టోరీ
శూరి(ఫహద్ ఫాజిల్) ఓ అనాథ. త్వరగా డబ్బు సంపాదించడం కోసం ఏ చిన్న ఉపాయానికైనా వెనకాడని వ్యక్తి. ఈ క్రమంలో లోకల్ గ్యాంగ్‌స్టర్ అస్లామ్ భాయ్(మహేష్ మంజ్రేకర్)ను మోసం చేసి రెండు రోజుల్లో 25 లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చుకుంటాడు. ఆ డబ్బు కోసం తీవ్రంగా వెతుకుతున్న సమయంలో అతనికి దివ్య(సారా పాలేకర్) అనే ధనిక కుటుంబానికి చెందిన చిన్నారి పరిచయమవుతుంది. శూరిని ఓ గొప్ప మెజీషియన్ అని పొరబడిన దివ్య, అతని సహాయం కోరుతుంది. ఆమె ద్వారా తన అప్పులు తీర్చుకోవచ్చని భావించిన శూరి ఆమెతో కలిసి ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఈ ప్రయాణంలో వారిద్దరి మధ్య జరిగే పరిణామాలు, శూరి మనస్సాక్షి ఎలా మారేది అనేదే మిగతా కథ.

Don t Trouble the Trouble Movie Review Fahadh Faasil Fantasy Comedy Works in Bits and Pieces Full Details

ప్లస్ పాయింట్లు
ఈ సినిమాకు ప్రధాన బలం ఫహద్ ఫాజిల్ నటన. పూర్తిస్థాయి ఫాంటసీ కామెడీ పాత్రలో ఆయన తన టైమింగ్, ముఖ కవళికలు, స్వయంగా చెప్పుకున్న తెలుగు డైలాగ్ డెలివరీతో సీన్లను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ సారా పాలేకర్ తన తొలి తెలుగు చిత్రంలోనే అద్భుతమైన నటన కనబరిచింది. ఫహద్ ఫాజిల్‌తో ఆమె కెమిస్ట్రీ, సహజమైన అమాయకత్వం, మధ్యమధ్యలో వచ్చే కోపం సినిమాకు మంచి వినోదాన్ని అందించాయి. వారితో పాటు ఉండే బీగల్ కుక్క పిల్ల సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవ తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.

ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?

మైనస్ పాయింట్లు
కథ, కథనంలో సరైన భావోద్వేగాలు లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన బలహీనత. ట్రైలర్లోనే కథాంశం చాలా వరకు బయటపడటంతో స్క్రీన్‌పై కొత్తదనం లోపించింది. ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ సీన్లు వర్కవుట్ అయినప్పటికీ.. సెకండాఫ్‌లో వచ్చే విచారణ ట్రాక్ కథనాన్ని బాగా నెమ్మదింపజేస్తుంది. కథలో బలమైన ఘర్షణ లేకపోవడం వల్ల క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ప్రధాన పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా పండకపోవడం మైనస్ పాయింట్ గా నిలిచింది.

సాంకేతిక విభాగాలు
డైరెక్టర్ శశాంక్ ఏలేటి ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నా, స్క్రీన్‌ప్లే రాయడంలో, తెరపై దాన్ని ఆవిష్కరించడంలో తడబడ్డారు. బ్రాడ్ ఫ్రాన్సిస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఎనర్జిటిక్‌గా ఉంచడానికి సహాయపడింది. అయితే ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉండాల్సింది. అనవసరంగా సాగదీసిన కొన్ని సీన్లను కట్ చేసి ఉంటే సినిమా వేగం పెరిగేది. నిర్మాణ విలువలు ఎస్ఎస్ కార్తికేయ ప్రమాణాలకు తగ్గట్టుగా రిచ్ గా ఉన్నాయి.

ఫైనల్‌గా..
మొత్తంగా చెప్పాలంటే 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా అక్కడక్కడా మాత్రమే నవ్వించే ఓ సగం పండిన ఫాంటసీ డ్రామా. ఫహద్ ఫాజిల్ అద్భుతమైన నటన, చిన్నారి సారా పాలేకర్ క్యూట్ పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు.

రేటింగ్: 2.5/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+