తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. పెళ్లైన 9 ఏళ్లకు ప్రెగ్నెన్సీ
తల్లి కావాలని ప్రతి మహిళ ఆశపడుతుంది. తల్లి కావడం అనేది ఏ స్త్రీకి అయిన అమితానందాన్ని ఇస్తోంది. తాజాగా ఓ ప్రముఖ నటి తాను తల్లి కాబోతుందని ప్రకటించింది. అది కూడా పెళ్లైన 9 ఏళ్లకు తల్లి కావడంతో ఆమె ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. ఆ నటి మరెవ్వరో కాదు.. ద్రష్టి ధామి. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ జనాలకు ఈ పేరు సుపరిచితమే. 2007లో దిల్ మిల్ గయే సీరియల్‌తో ద్రష్టి ధామి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియేలో పాల్గొని ఫుల్ క్రేజ్‌ను సంపాదించకుంది. 'మధుబాల, ఏక్ ఇష్క్ ఏ జూనున్' సీరియల్స్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇందులో ద్రష్టి వివియన్ దేనాకు జంటగా నటించింది. ఇటీవలే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో ది ఎంపైర్, దురంగ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇక ద్రష్టి ధామి 2015లో నీరజ్ ఖేమ్కాను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే పెళ్లై ఇన్నేళ్లు అయినప్పటికి కూడా ఆమె తల్లి కాలేకపోయింది.

అయితే ఆమె తాజాగా అభిమానులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. పెళ్లయిన దాదాపు తొమ్మిదేళ్లకు తాను తల్లి కాబోతున్నట్టు ఈ భామ ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ నటులు, అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ద్రష్టి ధామి వెల్లడించింది.












Click it and Unblock the Notifications