'Dude ' రివ్యూ.. హిట్ బొమ్మ
టాలీవుడ్‌లో యూత్ ఐకాన్‌గా మారాడు ప్రదీప్ రంగనాథన్. లవ్ టూడే, డ్రాగన్ వంటి వరుస హిట్లతో ప్రదీప్ రంగనాథన్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు.తన మునుపటి విజయాల తర్వాత, ఈసారి 'డ్యూడ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. టీజర్, ట్రైలర్‌తో భారీ అంచనాలను పెంచిన ఈ చిత్రం, దర్శకుడు కీర్తి స్వరణ్ దర్శకత్వంలో శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ తెలిసిన ప్రేమకథలో ప్రదీప్ తన నట విశ్వరూపం చూపించాడా? తెలుసుకుందాం.
కథ
పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) ముద్దుల కూతురు కుందన (మమితా బైజు), తన చిన్ననాటి బావ గగన్ (ప్రదీప్ రంగనాథన్)ను అమితంగా ప్రేమిస్తుంది. అయితే, గగన్ ఆమె ప్రేమను రిజెక్ట్ చేస్తాడు. బాధతో కుందన బెంగళూరు వెళ్లిన తర్వాత, మనిషి విలువ దూరం అయితేనే తెలుస్తుందన్నట్టుగా, గగన్ ఆమెను తలుచుకుంటూ ప్రేమలో పడతాడు.

మావయ్య దగ్గర ప్రేమ విషయం చెప్పి, పెళ్లికి సిద్ధమవుతాడు. మరి కుందన తిరిగి వచ్చిన గగన్ ప్రేమను అంగీకరించిందా? ఈ కథలో నేహా శెట్టి పాత్ర ఏంటి? గగన్‌కు మరో పోటీదారు పార్ధు ఎవరు? ఈ ఎమోషనల్ జర్నీని తెరపైనే చూడాలి.
విశ్లేషణ
నిజం చెప్పాలంటే, బంధువుల మధ్య ప్రేమ, రిజెక్షన్, వియోగం... ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కానీ, దర్శకుడు కీర్తిస్వరణ్ పాత కథను ఎంచుకున్నా, దాన్ని తాజా నరేషన్‌తో చెప్పడంలో విజయం సాధించాడు. సినిమా మొత్తం ప్రదీప్ రంగనాథన్ భుజాలపైనే నడుస్తుంది.
కథనం పాతదే అయినప్పటికీ, యూత్‌ను కనెక్ట్ చేసేలా రాసిన డైలాగ్స్, సరళమైన భావోద్వేగ సన్నివేశాలు సినిమాను ఎక్కడా బోర్ కొట్టనివ్వవు.ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ 'ఆర్య 2' ఛాయలను గుర్తు చేసినా, క్లైమాక్స్ మాత్రం భావోద్వేగంగా, కన్విన్సింగ్‌గా ముగుస్తుంది. చివర్లో వచ్చే తేలికపాటి కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్
ప్రదీప్ రంగనాథన్: ఈ సినిమాకు ప్రాణం పోశాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ప్రేమలో తడబడే కుర్రాడి నుంచి, ఫ్యామిలీ ప్రెషర్ ఫేస్ చేసే యువకుడి దాకా ప్రతి లేయర్‌ను అద్భుతంగా పండించాడు. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీక్వెన్స్‌లలో ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. 'డ్యూడ్'లో ప్రదీప్లోని పూర్తి నటుడు బయటకు వచ్చేశాడు. కుందన పాత్రలో మమితా బైజు నటన చాలా సహజంగా ఉంది. ప్రేమ, బాధ, భావోద్వేగాలను చక్కగా పలికించింది. ప్రదీప్‌తో ఆమె కెమిస్ట్రీ నేచురల్‌గా వర్కౌట్ అయ్యింది.శరత్ కుమార్ రాజకీయ నాయకుడి పాత్రలో హాస్యం, భావోద్వేగాలను మిళితం చేసి కొత్తదనం చూపించారు. రోహిణి తల్లి పాత్రలో తన క్లాసిక్ నటనతో మెప్పించారు. నేహా శెట్టి, హృదూ హరూన్ వంటి ఇతర నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
సాయి అభ్యంకర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు మంచి ఎమోషనల్ ఫీలింగ్‌ను ఇచ్చాయి. టైటిల్ సాంగ్, కుందన లవ్ థీమ్ విజువల్స్‌తో పాటు మరింత ఆకట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా కనిపించాయి, ప్రతి ఫ్రేమ్‌లోనూ క్వాలిటీ ఉంది.
ఫైనల్‌గా
'డ్యూడ్' సినిమా తెలిసిన కథనే అయినా, ప్రదీప్ రంగనాథన్ అద్భుతమైన నటన, దర్శకుడి ఫ్రెష్ నరేషన్‌తో మెప్పించింది. ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయ్యే అంశాలు, మంచి ఫీల్ ఉన్న సంగీతం సినిమాను నిలబెట్టాయి. రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా క్లాస్ ఆడియెన్స్‌కు, ఫ్యామిలీ ప్రేక్షకులకు మంచి వీక్షణ అనుభూతిని ఇస్తుంది. ప్రదీప్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా తప్పక నచ్చుతుంది.
రేటింగ్: 3.25/5
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!












Click it and Unblock the Notifications