ఆడవాళ్లకు కోరికలుంటాయి..అందుకే అలా చేస్తారు..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
నటి ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు.ఎస్తేర్ అందాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా ఇచ్చింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబ్బాదాలు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా నటించింది.మరీ ముఖ్యంగా భీమవరం బుల్లోడులో నటించిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. ఇక తర్వాత గరం, జయ జానికి నాయక, జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం,69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.
ఇక ప్రముఖ సింగర్ నోయెల్ సీన్ కొన్నాళ్లు ప్రేమయాణం సాగించిన ఈ భామ .. 2019లో అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది నెలలకే అభిప్రాయభేదాలు రావడంతో అతనికి విడాకులిచ్చింది. పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తేర్ గ్లామర్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా రెక్కి సినిమాలో ఎస్తేర్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. ఈ సినిమా తర్వాత చాలామంది ఎస్తేర్‌కు అభిమానులుగా మారిపోయారు.ఈ మధ్య టెనెంట్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా తన నటన, యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ఎస్తేర్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇప్పుడు దర్శకురాలిగా నిర్మాతగా మారింది ఎస్తేర్.ప్రస్తుతం హీరో ది వేకెంట్ హౌస్ అనే సినిమాను రూపొందిస్తుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ పలు ఆసక్తకర కామెంట్స్ చేశారు. తనకు ఒంటరిగా ఉండాలని లేదని, రెండో పెళ్లి చేసుకుంటా అని తెలిపింది. నాకు ఒంటరిగా బతకాలని లేదు. పెళ్లి చేసుకోవాని ఉంది. నాకు పార్టనర్ కావాలి, బ్యూటీఫుల్ లైఫ్ కావాలి. కానీ ఎవరిని చేసుకోవాలి అనేదానిపై పూర్తి క్లారిటీ లేదు. ఇప్పటికే మొదటి పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. షోకేస్ లాంటి మొగడు వద్దు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.. మగాళ్లు అడగటం మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఆఫర్ చేయడం కూడా ఇండస్ట్రీలో ఉంది అని తెలిపింది ఎస్తేర్. ఆడవాళ్లకు కోరికలు ఉండకూడదా.? అదేదో పెద్ద నేరంలా ఇప్పటి సమాజం చూస్తుంది. ఆడాళ్లకు ఓ జీవితం ఉంటుంది. వారికి ఎమోషన్స్ ఉంటాయని ఎస్తేర్ తెలిపారు.












Click it and Unblock the Notifications