ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. వచ్చే ఏడాది జనవరిలో కల్కి 2 షూటింగ్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రం ఇటీవలే విడుదలయ్యి బాక్సాఫీసులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యినప్పటి నుంచి చాలామంది ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక, కల్కి సెకండ్ పార్ట్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రభాస్ అభిమానులకు కల్కి మేకర్స్ అదిరిపోయే న్యూస్‌ను అందించారు. త్వరలోనే కల్కి 2 షూటింగ్‌ను మొదలు పెట్టేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ విషయంపై స్వయంగా కల్కి సినిమా నిర్మాతలే కీలకమైన అప్‌డేట్‌ను అందించారు. ఇటీవల రష్యాలో జరిగిన మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం వీక్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ భార్య, నిర్బాత స్వప్నదత్, మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడిన మూవీ మేకర్స్ కల్కి పార్ట్ 2 షూటింగ్‌పై క్రేజీ న్యూస్ అందించారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో కల్కి 2 షూటింగ్ ప్రారంభమవుతుందని వారు తెలిపారు. షూటింగ్ మొదలు కాగానే కల్కి చిత్రం పార్ట్ 2కు సంబంధించిన మరిన్ని కీలకమైన అప్‌డేట్స్ ఇస్తామని చెప్పారు. ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు కాస్త ఎగిరి గంతేస్తున్నారు.

పలు షూటింగ్‌లతో ఫుల్ బిజి...
కల్కి 2898 ఏడీ చిత్రం జూన్ 27న ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలయిన కొద్దీరోజుల్లోనే బాక్సాఫీసు కలెక్షన్లను బద్దలుకొట్టింది. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసింది. ఇక, ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ మరెందరో ఉన్నారు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ నటి దీపికా పదుకుణే, విలక్షణ నటుడు కమల్‌హాసన్, దిశాపటాని వంటి వారెందరో ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, హను రాఘవపూడి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇటీవలే హను రాఘవపూడి సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమం కూడా జరిగిన సంగతి తెలిసిందే.. ఇదిలా ఉండగా, మరోవైపు రాజా సాబ్ షూటింగ్‌లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఈ చిత్రాలతో పాటు సలార్ 2 షూటింగ్ కూడా రన్నింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే రాజా సాబ్ ముగింపు దశకు చేరుకుంటుందని, ఆ తర్వాత కల్కి 2 షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications