జబర్దస్త్ లవర్స్‌కి గుండె పగిలే వార్త
టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో సరికొత్త ట్రెండ్ సృష్టించిందనే చెప్పాలి. ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందించడంలో జబర్దస్త్ షో సూపర్ సక్సెస్ అయింది. జబర్దస్త్ ద్వారా చాలామంది ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు, రోజా వంటి వారు కూడా జబర్దస్త్ షో ద్వారా తమ పాపులారిటీని మరింత పెంచుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ షో కూడా ఓ కారణమని రోజా చెప్పారంటే ఆ షో ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచియమైన వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, షకలక శంకర్ వంటి వారు జబర్దస్త్ షోతో వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా నటించారు. ఇక సుడిగాలి సుధీర్ అయితే జబర్దస్త్ షోతో బుల్లితెర మెగాస్టార్‌గా మారిపోయాడు. సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక షోలో యాంకరింగ్ చేసిన అనసూయ, రష్మీ కెరీర్ ఎలా దూసుకుపోతుందో అందరికి తెలిసిందే.

ఇక టీఆర్పీ రేటింగ్స్ కూడా ఈ షో దూసుకుపోయింది. అంతలా హిట్ అయింది కాబట్టే జబర్దస్త్ షో రెండుగా చేసి ఎక్ట్సా జబర్దస్త్ అని సపరేటు షో చేశారు. అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ షో పెద్దగా క్లిక్ కావడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ షో నుంచి తప్పుకున్న తర్వాత జబర్దస్త్‌ను ప్రేక్షకులు పెద్దగా చూడటం లేదు. ఇదే సమయంలో రోజా, నాగబాబు,గెటప్ శ్రీను ,షకలక శంకర్ వంటి వారు సైతం షోకు దూరం కావడం జబర్దస్త్‌కు మైనస్‌గా మారింది.
దీంతో జబర్దస్త్ రెండు షోలలో ఒకదాన్ని క్లోజ్ చేసి మరొకటిని రన్ చేయాలని యాజమాన్యం భావిస్తోన్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎక్ట్సా జబర్దస్త్ షోను క్లోజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రొమోలో యాంకర్ రష్మీ క్లారిటీ ఇచ్చారు.గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ ట్రాజబర్దస్త్ ఉండేది. ఇప్పుడు శుక్రవారం, శనివారం జబర్దస్త్ ని ప్రసారం చేయబోతున్నట్టు యాంకర్ రష్మి తెలిపారు.
అంటే ఒకే షోని రెండు సగం ఒక రోజు, మరో సగం మరో రోజు ప్రసారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు జబర్దస్త్ షో నుంచి జడ్జ్ ఇంద్రజ తప్పుకున్నట్టు ఈ ప్రొమోలో చూపించారు. జబర్దస్త్ షోలు రెండు ఒకటి కాబోతున్న నేపథ్యంలో ఖుష్బూని ఉంచి ఇంద్రజని పంపిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే యాంకర్ రష్మి కంటిన్యూ అవుతారని, మరో యాంకర్ సిరి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కామెడియన్లు అంతా కంటిన్యూ అవుతారని తెలుస్తోంది.దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications