ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో విజయ్ దేవరకొండ.. ఫోటోలు వైరల్..!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లవ్ లో ఉన్నట్లు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎన్నో ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ ఊహాగానాలకు తెరదించుతూ తాము వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్లు ఇటీవల విజయ్- రష్మిక పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా తమ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్స్ ద్వారా తెలిపారు. ఇక ఫిబ్రవరి 26 న వీరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఘనంగా జరగనుంది. ఈ వెడ్డింగ్ కోసం ఇప్పటికే సెలబ్రిటీలు, ఇరు కుటుంబాల బంధువులు ఉదయ్ పూర్ కు చేరుకుంటున్నారు.

ఇక విజయ్- రష్మిక జంట ఫిబ్రవరి 26 న తెలుగు, కర్ణాటక(కొడువ) సంప్రదాయాల్లో రెండుసార్లు వివాహం చేసుకోనున్నారు. ఉదయం తెలుగు పద్ధతిలో వివాహం చేసుకోనున్నారు. అలాగే సాయంత్రం కొడువ సంప్రదాయంలో పెళ్లి జరగనుంది. అనంతరం మార్చి 3న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక విజయ్- రష్మిక.. విరోష్ జంటకు సెలబ్రిటీలు, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా విషెస్ చెబుతున్నారు.

ఇదిలాఉంటే విజయ్ దేవరకొండ.. గతంలో ఓ బెల్జియన్ మోడల్ తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లిచూపులు మూవీ సమయంలో విజయ్ దేవరకొండ.. బెల్జియన్ మోడల్ వర్జినీ ప్రేమాయణం నడిపినట్లు నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రిలేషన్ పై అటు విజయ్ గానీ.. వర్జినీ గానీ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం విజయ్ మ్యారేజ్ నేపథ్యంలో ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
వర్జినీ ఓ బెల్జియన్ మోడల్. విజయ్ దేవరకొండతో రిలేషన్ ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది. అయితే 2016 లో పెళ్లిచూపులు మూవీ సమయంలో విజయ్- వర్జినీ క్లోజ్ అయినట్లు సమాచారం. అంతేకాక ఈ మూవీలో వర్జినీ కేమియోగా కనిపించింది. ఈ సినిమాలో ఆమె యూట్యూబ్ ఆఫీస్ ఎంప్లాయ్ గా నటించింది. ఆ తర్వాత వీరిద్దరికీ సంబంధించిన మరిన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అయ్యాయి.

వర్జినీ కూడా తన ఇన్ స్టాలో విజయ్ పై ఉన్న ప్రేమను పోస్టు చేసింది. నాలుగేళ్లుగా తాము ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో పోస్టు పెట్టింది. విజయ్ తన బెటర్ హాఫ్ అని విజయ్ బర్త్ డే రోజున ఈ పోస్టు ఇన్ స్టాలో పెట్టింది వర్జినీ. విజయ్ ఫ్యామిలీతో వర్జినీ ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత 2017-18 సమయంలో వర్జీనీతో విజయ్ కు బ్రేకప్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత 2018 లో విజయ్- రష్మిక జంటగా నటించిన గీత గోవిందం మూవీ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications