Family star review : విజయ్ దేవరకొండ సినిమా ఎలా ఉందంటే..?
వరుస ప్లాపులతో సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ..'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'గీతగోవిందం' తరువాత దర్శకుడు పరుశురామ్‌తో మరోసారి కలిసి విజయ్ దేవరకొండ చేసిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ , ట్రైలర్.. ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సినిమాలో విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా మనకు కనిపిస్తాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగే యువకుడి పాత్రను విజయ్ పోషించాడు. మొదటి భాగంలో హీరోయిన్‌తో ప్రేమ గురించి చూపించిన దర్శకుడు .. రెండో భాగంలో పెళ్లి తరువాత వచ్చే సమస్యలు, భార్యభర్తల జీవితంలో తలెత్తే విభేదాలు గురించి చూపించారు. పెళ్లి తరువాత వచ్చే విభేదాలు గురించి సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు.

దర్శకుడు ఫస్ట్ ఆఫ్ మొత్తాన్ని కామెడీతో నడిపించి సెకండాఫ్‌ను ఎమోషనల్‌గా ముందుకు తీసుకువెళ్తాడు. అయితే కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. కానీ దర్శకుడు పరుశురామ్ తన సంభాషణలతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. సినిమాని నడిపించిన విధానం కూడా ఎక్కడా బోర్ లేకుండా చాలా ఎంగేజింగ్ తీసుకెళ్లడంలో పరుశురామ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

ఇక విజయ్ దేవరకొండ యాక్టింగ్ విషయానిస్తే.. వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. సినిమా కథకు తగ్గట్టు విజయ్ దేవరకొండ తన నటనను మార్చుకున్న విధానం తెర మీద కనిపిస్తోంది. సినిమా భారం మొత్తాన్ని విజయ్ తన భూజాల మీద మోసాడు. ఇక మృణాల్ ఠాకూర్ తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. గ్లామర్‌గా కనిపించడానికి పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ..తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

తెర మీద విజయ్ దేవరకొండ,మృణాల్ ఠాకూర్ జంట చూడముచ్చటగా ఉంటుంది. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పరిధి మేర నటించారనే చెప్పాలి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే..గోపీసుందర్ అందించిన మ్యూజిక్ ఓకే అనేలా ఉంది. గీతా గోవిందం రేంజ్‌లో పాటలు,నేపథ్యం లేకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరాశకు గురవుతారు. సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా చేసిన కేయూ మోహనన్ కూడా అద్భుతమైన విజువల్స్‌ని అందించారు.
ఈ మండు వేసవిలో ఒక్కసారి మీ ఫ్యామిలీ కలిసి 'ఫ్యామిలీ స్టార్'ను చూడవచ్చు.












Click it and Unblock the Notifications