ఆ మెగా జంట విడిపోవడం ఖాయం ..వేణు స్వామి మరో సంచలనం

ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ఆయన చెప్పనవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువైంది. గతంలో నాగ చైతన్య- సమంత విడిపోతారని ముందే చెప్పిన వేణు స్వామి.. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఓ జంట విడిపోతారని చెప్పి సంచలనం సృష్టించారు.

తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న వేణు స్వామి మెగా హీరో వరుణ్ తేజ్ - లావణ్య తిపాఠిలు విడిపోతారని చెప్పారు. వీరి జాతకంలో గురువు , శుక్రుడు నీచంగా ఉన్నాయని..నాకు తెలిసి వాళ్లు కలిసి ఉండలేరని వేణు స్వామి చెప్పుకొచ్చారు. లావణ్య త్రిపాఠికి కుజ దోషం ఉంది..అలాగే వరుణ్ తేజ్‌కు నాగ దోషం ఉంది.. దీంతో వీరు కలిసి ఉండే అవకాశం లేదని ఆయన తెలిపారు. అసలు వీళ్లకు పెళ్లి యోగమే లేదని ..అలాంటి వీరు పెళ్లి చేసుకోవడం ఓ అద్భుతమని వేణు స్వామి తెలిపారు.

famous astrologer venu swamy about mega family hero varun tej get divorce

నేను ఏం చెప్పిన కూడా అది జాతకం ప్రకారం చెబుతానని..అంతే కానీ వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి చెప్పనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాస్త ఆలస్యం అయిన వీరు వీడిపోతారని ఆయన చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్ - లావణ్య తిపాఠిల విషయంలో తాను చెప్పిన మాటలు నిజం అవుతాయంటూ వేణు స్వామి కుండబద్దలు కొట్టేస్తున్నారు. మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుందని వేణు స్వామి ముందే చెప్పడం జరిగింది.

famous astrologer venu swamy about mega family hero varun tej get divorce

ఆమె విషయంలో వేణు స్వామి చెప్పినట్టుగానే జరిగింది. ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా విడాకులు తీసుకుంటాడని చెప్పడంతో మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. వరుణ్ తేజ్ - లావణ్య తిపాఠి విడిపోతారని చెప్పడంతో వేణు స్వామిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి చెప్పే హక్కు వేణు స్వామికి ఎక్కడుదంటూ వారు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+