పవన్ కల్యాణ్ ముందు యాటిట్యూడ్ చూపించిన ఏకైక హీరోయిన్

టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అయ్యారు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది మీరా జాస్మిన్. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తెలుగు ప్రేక్షకుల మనుస్సును మాత్రం దోచుకుంది ఈ అమ్మడు. శివాజీ హీరోగా నటించిన 'అమ్మాయి బావుంది' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.

అయినప్పటికి రెండో సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం దక్కించుకుంది. పవన్ కల్యాణ్ నటించిన గుడుంబా శంకర్‌లో మీరా జాస్మిన్ హీరోయిన్‌గా నటించింది. పాటలు సూపర్ హిట్‌గా నిలిచినప్పటికి, ఈ సినిమా మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది. అయితే చిత్ర నిర్మాత పైడి బాబు మీరా జాస్మిన్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. పవన్ కల్యాణ్‌తో సినిమా ఓకే అయిన తర్వాత హీరోయిన్ ఎవరైతే బావుంటుంది అనుకుంటుండగా మీరా జాస్మిన్ గురించి తెలిసింది. ట్యాలెంట్ అందం ఉన్న అమ్మాయి మీరా జాస్మిన్. వెంటనే ఆమెని ఓకె చేశామని ఆయన తెలిపారు.

famous producer made interesting comments on Meera Jasmine

మీరా జాస్మిన్ మంచే నటే కానీ, ఆమెకు ఓ మైనస్ ఉందని ర్మాత పైడి బాబు తెలిపారు.మీరా జాస్మిన్‌కు యాటిట్యూడ్ చూపించే అలవాటు ఉందని, సినిమా షూటింగ్ సమయంలో కూడా అలాగే బిహేవ్ చేసేదని పైడి బాబు చెప్పుకొచ్చారు. అది చాలా మందికి నచ్చలేదు. అందుకే ఆమెకి గ్లామర్, టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రాలేదని ఆయన అన్నారు. మీరా జాస్మిన్ తెలుగులో ముగ్గురు స్టార్ హీరోలతో మాత్రమే నటించారు. పవన్ కళ్యాణ్, బాలయ్యతో నటించిన గుడుంబా శంకర్, మహారథి సినిమాలు ఫ్లాప్ అవగా, రవితేజ తో నటించిన భద్ర సినిమా మీరా జాస్మిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+