భర్తకు ఎఫైర్... విడాకులిచ్చిన స్టార్ తెలుగు యాంకర్
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు , పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు. చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగచైతన్య, మోహన్ బాబు కొడుకు మనోజ్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య , పవన్ కళ్యాణ్ వంటి వారు విడాకులు తీసుకున్న వారి జాబితాలో ఉన్నారు.

తాజాగా ఈ జాబితాలో తెలుగు యాంకర్ కూడా చేరింది. గత కొద్దికాలంగా బుల్లితెర మీద ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్ తన భర్తకు చడీ చప్పుడు లేకుండా విడాకులిచ్చిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సదరు యాంకర్, తనకు పెళ్లైందనే విషయాన్ని కూడా గోప్యంగా ఉంచింది. ఓ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టింది. పెళ్లి తరువాత అవకాశాలు రావడంతో ఆమెకు ఫుల్ పాపులారిటీ పెరిగింది. స్టార్ హోదా రావడంతో అమ్మడు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఇదే సమయంలో భర్తతో విభేదాలు తలెత్తడంతో అతనికి దూరంగా ఉంటుంది. ఇటీవల భర్తకు విడాకులు ఇచ్చేసినట్టు తెలుస్తుంది. తన స్నేహితుల వల్లే ఆమె భర్త నుంచి విడిపోయిందని తెలుస్తోంది. విడాకులకు ఇండస్ట్రీలో ఉన్న ఆమె స్నేహితులే కారణమనే టాక్ నడుస్తోంది. ఇక విడాకులు అనంతరం అమ్మడు ఫుల్‌గా రెచ్చిపోతుంది. ఈ యాంకర్ గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. సోషల్ మీడియాలో ఈ మధ్య ఆమె పోస్ట్ చేస్తున్న గ్లామర్ ఫోటోలు చూస్తునే ఇది అర్థం అవుతుంది.












Click it and Unblock the Notifications